తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పే టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికరంగా మాట్లాడారు. టీడీపీ భవిష్యత్ నాయకత్వం పై స్పందిస్తూ, ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ముప్పు ఏమి లేదని, చంద్రబాబుకి ఎంత వయసు వచ్చినా, ఆయనకు పోరాడే స్పూర్తి ఉందని, అదే నడిపిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇకముందు కూడా చంద్రబాబే దిక్కని, ఆయన తప్ప మరో నాయకత్వంలేదని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు కాకుండా, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తుంది కదా అని అడగగా, సినిమా వాళ్ళును చూడటానికి ప్రజలు వస్తారని అన్నారు. ఇప్పుడు కనుకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, కొన్నాళ్ళకు నాయకుడు అవ్వచ్చు ఏమో కాని, వెంటనే ఆయన పార్టీ నడిపించే నాయకుడు అవుతాడని అనుకోవటం లేదని అన్నారు.

"పవన్ కల్యాణ్ అంతటి పెద్ద స్టార్ట్ కి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పాను. పవన్ కు ఎంత పేరుంది? మిమ్మల్ని చూడ్డానికి జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పాను. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. తానిప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఏ పార్టీవైపు మొగ్గు చూపడంలేదన్నారు. మా పార్టీలోకి వస్తారా అని తనను కొందరు అడిగిన మాట వాస్తవమేనని, అయితే తాను అమిత్ షాను కలిసినట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని జేసీ స్పష్టం చేశారు. తాను ఎన్నికల ముందు చాలాసార్లు నరేంద్ర మోదీని కలిశానే తప్ప అమిత్ షాతో ఎన్నడూ భేటీ కాలేదని చెప్పారు. తాను టీడీపీలోనే ఉన్నానని, అయితే కొంతకాలంగా పాటు మౌనంగా ఉందామని చంద్రబాబుతో కూడా చెప్పానని వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read