రాజకీయాలు మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు ప్రజలను సమ్మోహనాస్త్రులను చేసే నాయకులుంటే సరిపోయేది. కానీ రానూ రానూ రాజకీయాల్లో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం ఛరిష్మాటిక్ లీడర్లు మాత్రమే ఉంటే సరిపోదని, వారికి తోడు పాచికలు వేసే వ్యూహకర్తలు సైతం ఉండాలన్న డిమాండ్ వేగంగా పెరిగిపోతోంది. అలా వ్యూహకర్తలను నియమించుకుంటేనే పార్టీలు ఎన్నికల్లో సక్సెస్ అవుతున్నాయి. ఇదే కోవలో ఉన్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కి అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ అనే ఓ సంస్థను స్థాపించి దాని ద్వారా ఆయా పార్టీల నేతలకు కావల్సిన వ్యూహాలను పీకే అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఆయన పలు పార్టీలను గెలిపించి విజయానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.

pk 14062019 1

ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించారని.. రహస్యంగా చర్చలు సాగాయని కొన్ని గంటలుగా అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ చానెళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్న విషయం విదితమే. అంతేకాదు టీడీపీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబు పీకేను సంప్రదించాలని సలహా ఇచ్చారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ అధినేత బాబు.. వ్యూహకర్త పీకేను సంప్రదించారన్న వార్తలు నారా లోకేష్ దృష్టికి రావడంతో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ సంప్రదించినట్లు వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని.. అసలు మేం ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read