నిన్న గన్నవరం విమానాశ్రయంలో అక్కడ, భద్రతా సిబ్బంది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తనిఖీ చేయడం, అక్కడ నుంచి సామాన్య ప్రజలు వెళ్ళే బస్ లో పంపించటం పై తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న కార్ ని ఎయిర్‌పోర్టులోకి అక్కడి భద్రతా సిబ్బంది లోపలకి అనుమతించకపోవడం, జెడ్ + భద్రత ఉన్నా సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును పూర్తిగా తనిఖీ చేసిన లోపలకి పంపించిన తీరును తెలుగుదేశం శ్రేణులు గర్హిస్తున్నాయి. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకు, అక్కడి అధికారులు ప్రత్యేక వాహనం ఎందుకు కేటాయించలేదని పార్టీ వైపు నుంచి ప్రశ్నిస్తున్నారు. రాఇదీ ఒక్కటే కాదని, రెండు రోజుల క్రిందట చంద్రబాబు వెళ్ళే కాన్వాయ్కి, పైలెట్ క్లియరెన్స్ వెహికల్ ని తొలగించటం పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. జెడ్ + ఉన్న చంద్రబాబు వాహనం ట్రాఫిక్‌లో ఆగితే, భద్రత పరంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయో ప్రభుత్వానికి తెలియదా అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సోషల్ మీడియా లో హీట్ హీట్ వాదనలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో ఆయన్ను కూడా ఇలాగే తనిఖీ చేశారని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే అప్పటికి జగన్ ఒక ప్రతిపక్ష నేత మాత్రమే అని, తనకు ఉన్నది చంద్రబాబు లాగా జెడ్ + భద్రత కాదని, అదీ కాక, కండీషనల్ బెయిల్ పై బయట తిరిగే వ్యక్తి జగన్ అని, అందుకే తనిఖీలు చేసారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటన పై వాదోపవాదనలు నడుస్తున్న టైములో, దీనికి మరింత మంట పెడుతూ, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వెటకారపు ట్వీట్ చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. ‘చంద్రబాబు కాన్వాయ్కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట, ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాంగా ట్వీట్ చేసారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్, తెలుగుదేశం వర్గాలని మరింత అవమానం కలిగించేలా, వైసీపీ వర్గాన్ని మరింతగా రేచ్చిపోమని చెప్పేలా ఉన్నాయి.