ఆయన ఒక చర్చి ఫాదర్‌... కాని చేసే పనులు మాత్రం, సమాజం తల దించుకునే పనులు. నగ్నంగా పడుకుని బాడీ మసాజ్‌ చేయాలని, బాలికలను బెదిరించటం ఆయన పని. ఈ ఘటన అనంతపురం జిల్లాలో బయట పడి, అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు పై సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి రంగంలోకి దిగి, అతడిని శిక్షించమని ఆదేశించినా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేయలేని దుస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ ఘటన వివరాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరుగుతుంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చెందిన ఒక మహిళ కుమార్తె, అక్కడి చర్చి స్కూలులో 8వ క్లాస్ చదువుతోంది. ఆ బాలిక చర్చికి వెళ్లిన సమయంలో, అక్కడి చర్చి ఫాదర్‌ ఎమిలిరాజ్‌, ఆ బాలికతో పాటు, అక్కడ ఉన్న మరి కొంత మంది అమ్మాయిలను తన ఇంటికి పిలిపించుకుని, ఒంటి పై దుస్తులు అన్నీ తీసేసి, నగ్నంగా పడుకుని బాడీ మసాజ్‌ చేయాలని బెదిరించినట్లు ఆ బాలిక తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అప్పటి సీఐ సురేందర్‌రెడ్డి చర్చి ఫాదర్‌కు మద్దతుగా పలికి, సెటిల్మెంట్‌ తో రాజీకి ప్రయత్నం చేసారు. కాని వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో మహిళా కమిషన్‌ ఆదేశాలతో తాడిపత్రి పోలీసులు 2019 మార్చి 30న చర్చి ఫాదర్‌పై కేసు నమోదు చేశారు.

కానీ, పోలీసులు ఎమిలిరాజ్‌ను అరెస్ట్‌ చేయలేదు. అప్పటికి ఎలక్షన్ హడావిడి ఉండటంతో, పోలీసులు ఇస్తా రాజ్యంగా చేసారు. అయితే కొత్త ప్రభుత్వం రావటంతో, మూడురోజుల క్రితం కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోంమంత్రి మేకతోటి సుచరితకు బాధిత బాలిక తల్లి ఫోన్‌ చేసి తన బాధను వివరించింది. దీని పై స్పందించిన హోంమంత్రి, పోలీసులకు ఫోన్‌ చేసి, చర్చి ఫాదర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. మంగళవారం రాత్రి ఎమిలిరాజ్‌ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు అక్కడకు వెళ్లగా చర్చి కమిటీ సభ్యులు, అక్కడ మహిళలు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటన పై హోంమంత్రి అరెస్ట్ చెయ్యమని చెప్పినా, స్థానిక పోలీసుల తీరును ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ లోపే చర్చి ఫాదర్‌ పరారైనట్లు తెలుస్తోంది. అతడిని మరో చర్చికి బదిలీ చేశారనే ప్రచారమూ జరుగుతోంది. కాగా, పోలీసుల తీరు పై బాధిత బాలిక తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిని అరెస్ట్ చెయ్యకపోతే, విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగుతానని ఆమె హెచ్చరిస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read