జూన్ మూడవ వారం వచ్చినా, వరుణ దేవుడు అడ్రెస్ లేడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎండ‌ల తీవ్రత కొన‌సాగుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భానుడు తన ప్ర‌తాపం చూపిస్తున్నాడు. వ‌డగాల్పుల తీవ్ర‌త కూడా అధికంగానే ఉంటోంది. ఈనెల 18వ తేదీ వ‌ర‌కు ఎండ‌ల తీవ్ర‌త ఇలానే కొన‌సాగుతుంద‌ని ఆర్టీజీఎస్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెద‌ర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంట‌ర్ (అవేర్‌) నిపుణులు చెబుతున్నారు. వాతావ‌ర‌ణంలో తేమ శాతం గ‌ణ‌నీయంగా ప‌డిపోతున్నందునఉష్ణోగ్ర‌త‌లుపెరుగుతాయని, వ‌డ‌గాల్పుల తీవ్ర‌త పెరుగుతుంద‌ని తెలిపారు. ఈ స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎండ‌ల్లో తిర‌గకుండానీడ‌ప‌ట్టున ఉండాల‌ని, ముఖ్యంగా చిన్నారులు, వృద్దుల విష‌యంలో త‌గిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆర్టీజీఎస్ నిపుణులు హెచ్చరించారు. శ‌నివారం రోజు కూడా ఎండ‌ల తీవ్ర‌త కొన‌సాగింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైతే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లా బొండాప‌ల్లె మండ‌లం క‌నిమెర‌క‌లో అత్య‌ధికంగా 46.20 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

విశాఖ‌జిల్లా దేవ‌రాప‌ల్లె మండ‌లం వేచ‌లంలో 46 డిగ్రీలు న‌మోద‌య్యాయి. ప్ర‌కాశం, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌తో పాటు, గుంటూరు జిల్లాలోనూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ప్ర‌కాశం జిల్లా టంగుటూరులో 45.79 డిగ్రీలు న‌మోదైతే, విజ‌య‌న‌గ‌రం జిల్లా పెద‌మెరంగిలో 45.37, తెనుబొడ్డ‌వ‌ర‌లో 45.19 డిగ్రీలు, విశాఖ జిల్లా భ‌లి గ‌ట్టంలో 45.08, గాదిరాయిలో 45.02 డిగ్రీలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పొదురులో 45.31, చిన్న‌య‌గూడెం 45.18, చిట్యాల 45.07లో డిగ్రీలు, తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లం కృష్ణా పురంలో 45.30, రాజోలు మండ‌లం శివ‌కోడు 45.17 డిగ్రీలు, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో 45.12 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఈ నెల 19న రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్రంలోని అనంత‌పురం, చిత్తూరు జిల్లాల‌ను రుతుప‌వ‌నాలు తాకుతాయ‌ని భావిస్తున్నారు. వీటి ప్ర‌భావం కార‌ణంగా ఈనెల 19 నుంచి 24 వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read