వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే అంటోంది జాతీయ మీడియా. వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గ కూర్పు తర్వాత ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ.. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో జేడీయూ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ పెద్దలు వైసీపీపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్‌పై వైసీపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చినప్పటి నుంచి బీజేపీతో వైసీపీ సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముగిసిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో 352 స్థానాల్లో ఘనవిజయం సాధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. 

deputy 11062019

ఎన్డీఏ కూటమిలో బీజేపీ 303 స్థానాలను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ లోక్‌సభ స్పీకర్‌గా ఎంపికకావొచ్చని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభలో యూపీఏ కూటమికి 87 మంది ఎంపీలుండగా, వారిలో కాంగ్రెస్‌ సభ్యులు 52 మంది వున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించాలని భావించగా, అందుకు ఆ పార్టీ నిరాకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో, 22 మంది ఎంపీలతో లోక్‌సభలో మూడవ పెద్ద పార్టీగా ఉన్న డీఎంకేకు ఆ పదవి దక్కే అవకాశం వుందని ముందు ప్రచారం జరిగింది. అయితే మనసు మార్చుకున్న మోడీ, షా, ఈ పదవి తమకు అప్రకటిత మిత్రపక్షంగా ఉన్న వైసిపీకి ఇస్తే బాగుటుంది అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read