ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే, ఎవరైనా ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అదేంటి అంటే, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని లైట్ తీసుకుని, దాన్ని తిప్పికొట్టటంలో తెలుగుదేశం పార్టీ విఫలం అవ్వటం. చివరకు వైసీపీ చేసిన ప్రచారామే నిజమని ప్రజలు నమ్మటం. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా, పోయిన సారి వైసీపీ చేసింది ఇదే. అయితే, ఓడిపోయిన తరువాత పాఠాలు నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ, ఈ సారి మాత్రం, అలా జరగనివ్వటం లేదు. వైసీపీ చేస్తున్న ప్రతి ఆరోపణ తిప్పి కొడుతుంది. తాజగా నిన్న వైఎస్ జగన్, ఎమ్మెల్యేలకు ఇచ్చే శిక్షణా తరగతిలో మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న టైములో, చంద్రబాబు నేను అబద్ధాలు మాత్రమే చెప్తానని అన్నారని, మనం అలా అబద్ధాలు చెప్పవద్దు అంటూ చెప్పిన విషయం పై లోకేష్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు, ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని కూడా యధాతధంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసుకువచ్చి, చంద్రబాబు మాట్లాడిన మాటలు పోస్ట్ చేసారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో, రాత్రికి రాత్రి 400 కోట్లు అంచనాలు పెంచేసిన విషయం పై ఆ రోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ అవినీతిని ఎలా బయట పెట్టింది చెప్పారు. ఆ నాడు ఒక వ్యుహ్యం ప్రకారం చంద్రబాబు మాట్లాడిన విషయం, తరువాత ఆ వ్యూహంలో ఇరుక్కుని వైఎస్ఆర్ ప్రభుత్వం, ఆ రోజు అసెంబ్లీలో ఎలా గిజగిజలాడింది లోకేష్ పోస్ట్ చేసారు. చంద్రబాబు అబద్దాలు చెప్తారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు, కౌంటర్ ఇస్తూ, ఆ రోజు జరిగిన ధనయజ్ఞం, 400 కోట్ల స్కాం గురించి, జగనే మళ్ళీ ప్రజలకు గుర్తు చేసినందుకు, లోకేష్ ధన్యవాదాలు చెప్పారు. మరి దీని పై జగన్ ఎలా స్పందిస్తారో చూద్దాం..