నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎయిర్ కనెక్టివిటీ కోసం, రేకుల షెడ్ లో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ని, గత 5 సంవత్సరాల్లో అంచెలంచెలుగా పెంచుకుంటూ, నేడు అంతర్జాతీయ విమానాలు దిగే విధంగా, ఆనాడు చంద్రబాబు ముందు చూపు, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సహకారంతో, గన్నవరం ఎయిర్ పోర్ట్ రూపు రేఖలు మార్చేసారు. గన్నవరం నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫైట్ , సింగపూర్ సర్వీస్ కూడా చాలా కష్టపడి తీసుకువచ్చారు. అయితే కొద్ది రోజులు క్రిందట, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, వయబులటీ గ్యాప్ ఫండింగ్ గురించి ప్రస్తావన చెయ్యక పోవటంతో, సింగపూర్ - గన్నవరం ఫ్లైట్ పూర్తిగా కాన్సిల్ అయ్యింది. అయితే, ఇప్పుడు గన్నవరం ఎయిర్ పోర్ట్ గురించి మరో బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. మొన్న సింగపూర్ సర్వీస్ రద్దు అయితే, ఇప్పుడు ఢిల్లీ సర్వీస్ పై వినిపిస్తున్న వార్తలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ నుంచి ఢిల్లీకి నడిచే సర్వీస్ ను పూర్తిగా రద్దు చేసారు. అయితే ఇది తాత్కలిమే అని చెప్తున్నారు.
ఇక మరో ఢిల్లీ సర్వీస్ ను షెడ్యూల్ కుదించారు. వారంలో కేవలం నాలుగురోజులు మాత్రమే తిప్పాలని నిర్ణయించారు. ప్రతి రోజూ సాయంత్రం 4.40 గంటలకు గన్నవరం నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ను ఎయిర్ ఇండియారద్దు చేసింది. జూలై 25 వరకు ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే వెంటనే మరో అప్డేట్ లో అక్టోబరు వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక మరో సర్వీస్ ఉదయం సమయంలో 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి 9.10గంటలకు బయలుదేరే సర్వీసును కుదించి, కేవలం వారంలో నాలుగు రోజులపాటే నడపాలని నిర్ణయించింది. అంటే వారంలో మూడు రోజుల పాటు ఉదయం పూట ఢిల్లీ కి ఎయిర్ సర్వీస్ ఉండదు. ఎయిర్ ఇండియా సంస్థ విమాన సర్వీసుల తగ్గించటంతో, ఈ ప్రభావం చార్జీల మీద చూపే అవకాశాలు ఉన్నాయి.