జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కీలకమైన అన్ని చోట్లా, తన మనుషులను పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే, జూన్ 22న జీవో నెం 68 జారీ చేస్తూ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జగన్ సన్నిహితుడు, నెంబర్ 2 అయిన ఎంపి విజయ సాయి రెడ్డిని నియమించారు. విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ అంటూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 13 రోజులు తరువాత, అంటే నిన్న, విజయసాయి రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తీసేస్తూ ప్రభుత్వం మరో జీవొ జారి చేసింది. ఎంపీగా ఉంటూ ఈ పదవిలో ఉండ కూడదు అని సమాచారం రావటంతో, వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజులు రెండు పదవులు అనుభివించారు. ఇప్పుడు ఇదే విషయం విజయసాయి రెడ్డి మెడకు చుట్టుకుని, ఆయన ఎంపీ పదవి కూడా పోయేలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. వ్యవస్థలు కనుక రూల్స్ ప్రకారం పని చేస్తే, విజయసాయి రెడ్డి వెంటనే తన రాజ్యసభ ఎంపీ పదవి కోల్పాతారు.

ఆర్టికల్ 102(1)ఏ ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విజయ సాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా తొలగించే అవకాసం ఉంది. ఆర్టికల్ 102(1) ఏ లో, ‘‘ If he holds any office of profit under the Government of India or the Government of any state, other than an office declared by parliament by law not to disqualify its holder ’’ అని పేర్కొన్నారు. విజయ సాయి రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ 22.06.2019న జీవో నెం 68 జారీ చేశారు. విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ కింద ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ నియామకాన్ని రద్దు చేస్తూ 04.07.2018న మరో జీవో ఇచ్చారు. అంటే 13 రోజుల పాటు ఆ పదవిలో విజయ సాయి రెడ్డి వ్యవహరించారు. 13రోజులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పనిచేసిన విజయ సాయి రెడ్డిని తక్షణమే ఎంపిగా అనర్హుడిగా ప్రకటించాలని ఎవరైనా కోర్ట్ కు వెళ్తే, ఆయన ఎంపీగా అనర్హుడు అవుతారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read