ప్రపంచ వ్యాప్తంగా, ఏమి లేకపోయినా ఉండగలరు కాని, చేతిలో ఫోన్ దానిలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లేకపోతే మాత్రం, ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి. అవి లేకపోతే జీవితమే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతలా మన జీవితాలు వాటితో అటాచ్ అయిపోయాయి. అయితే ఈ రోజు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డౌన్ అవ్వటంతో నెటిజెన్ లు అల్లాడిపోయారు. దీనికి కారణం, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో సాంకేతిక సమస్య రావటం. ముఖ్యంగా మన దేశంలో, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో ఏదైనా ఫోటో పెడుతుంటే, కనిపించటం లేదు అనే ఫిర్యాదులు వచ్చాయి. కొంత మందికి ఆడియో, వీడియో కూడా రావటం లేదని చెప్తున్నారు. దీంతో కొంచెం సేపు ఏమి జరుగుతుందో తెలియక, ఫోన్ ప్రాబ్లం అనుకుని కొందరు, నెట్ ప్రాబ్లం అనుకుని కొందరు ఇబ్బంది పడ్డారు. అయితే కొంచెం సేపటి తరువాత, అందరికీ ఇదే సమస్య ఉందని తెలుసుకుని, రిలాక్స్ అయ్యూర్.

ఇది ఇలా ఉంటే, కొన్ని దేశాల్లో పూర్తిగా డౌన్ అయ్యింది. యూరోప్‌, యూఎస్‌ఏ, ఆఫ్రికాలో పూర్తిగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డౌన్ అయినట్టు వార్తలువ్ అస్తున్నాయి. ఏదైనా సైబర్‌ ఎటాక్‌ జరిగిందా, సాంకేతిక సమస్య వచ్చిందో అర్ధం కాని పరిస్థితి. సాంకేతిక సమస్య అయితే, ఇంత సేపు డౌన్ అవ్వదని అంటున్నారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పనిచేయడం లేదని నెటిజెన్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపధ్యంలో, యాప్‌ డౌన్ అయినప్పుడు కనిపించే ఇండెక్స్ భారీగా పెరిగిపోయింది. మొత్తానికి, సాయంత్రం ఇంటికి వచ్చి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో రిలాక్స్ అయ్యే వారికి, ఈ రోజు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ షాక్ ఇచ్చాయి. తెల్లవారే సరికి, సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read