ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు పై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. చాలా అవమానకర రీతిలో జగన్ మాట్లడారు. అచ్చెన్నాయుడు అనే మనిషి ఆ సైజులో ఉంటాడు, కానీ బుర్ర, బుద్ధి పెరగలేదు అంటూ జగన్ ఎంతో హేళనగా మాట్లాడారు. సాక్షాత్తు ఒక సియంగా ఉంటూ, నిండు శాసనసభలో, మరో శాసనసభ్యుడిని, బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే, జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందో చూడవచ్చు. ఇది మొదటి సారి కాదు. నిన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు జగన్. మాటిమాటికీ ఇలాగే హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. నా బాడీ పెరిగిందని, కానీ బుద్ధి పెరగలేదని జగన్ నన్ను మాటి మాటికి విమర్శిస్తున్నారు అన్న అచ్చెంనాయుడు, జగన్,నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నా, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, హుందాతనం రావాలని కోరుకుంటున్నా అంటూ అచ్చెన్నాయుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ లో అచ్చెంనాయుడు ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, అన్ని అవాస్తవాలు చెప్పి, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేసి, పారిపోయారని అన్నారు. అసలు జగన్ గారికి ఏ విషయం పైనా అవగాహన లేదని అన్నారు. చాలామంది కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నట్లు విన్నాం, అలాగే జగన్ గారు శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకునే కన్సల్టంట్ ను పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. మేము మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్, చంద్రబాబుకి ఛాలెంజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. సమస్యలు దారి మళ్లించేందుకు చంద్రబాబును, తనను అవమానించేలా మాట్లాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు .