కొద్ది రోజుల క్రితం సీబీఐ అంతర్గత పోరు వ్యవహారంలో హైదరాబాద్ వ్యాపారి సాన సతీశ్ బాబు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతోనే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదైంది. తరువాత జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సతీష్ సానాను మనీ లాండరింగ్ కేసులో సిబిఐ రెండు రోజుల క్రిందట అరెస్ట్ చేసింది. అయితే ప్రతి వ్యవహారాన్ని చంద్రబాబుకి లింక్ చేసే వైసీపీ పార్టీ, ఈ సతీష్ సనా కూడా చంద్రబాబు బినామీ అని, చంద్రబాబు అవినీతి డబ్బులు అంతా మనీ లాండరింగ్ ద్వరా, విదేశాలకు తరలించింది ఇతనే అంటూ, సతీష్ సానా, చంద్రబాబు రిలేషన్ పై సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలాని, వైసీపీ ఏ2 విజయసాయి రెడ్డి, ఈ రోజు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ చంద్రబాబు పై విమర్శలు చేసారు.
అయితే దీని పై అదే రీతిలో బదులు ఇచ్చారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సతీష్ సానా వైసీపీ నేతలకు ఎలా సహయం చేసింది, అప్పట్లో వచ్చిన పత్రికా కధనాలు పోస్ట్ చేస్తూ, బుద్దా వెనకన్న ఘాటుగా బదులు ఇచ్చారు. "విజయసాయి రెడ్డి గారు, ఎక్కువ లాగకు, తెగుద్ది. మనీ లాండరింగ్ కింగ్ వి నువ్వు. ఇలాంటి వాడితో, నీకే పని ఎక్కువ. దేశంలో ఏ దరిద్రం జరిగినా, దాని వెనుక నువ్వు, నీ బాస్ ఉంటారనేది, ఇప్పటికే ఈ దేశం ఎన్నో సార్లు చూసింది. తొందరలోనే టైటానియం కేసులో అమెరికా వెళ్ళటానికి మీ ఆత్మ రెడీగా ఉన్నాడు. పిఎంఓలో దూరి అది ఆపే సంగతి చూడు." అంటూ విజయసాయి రెడ్డి గాలి మొత్తం తీస్తూ, సాతీష్ సానాకి వైసిపీ నేతలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, బుద్దా వెంకన్న ట్వీట్ చేసారు.
ఎవరీ సతీష్ సానా ? జగన్ కేసుల్లో ఒకటైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ గ్రూప్ కంపెనీల్లో కొద్ది రోజులు సతీశ్ బాబు డైరెక్టర్‌గా పని చేశారు. 2007 నుంచి దాదపుగా 24 కంపెనీల్లో సతీష్ సానా డైరెక్టర్‌గా పని చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు చెందిన సుకేశ్ గుప్తాను అప్పట్లో సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనకు బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్‌లో సతీశ్ బాబు ఢిల్లీ వెళ్లాడని ఈడీ ఒక ఛార్జిషీట్ కూడా పెట్టింది. అంతే కాదు, నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ, షబ్బీర్ ఆలీ తోపాటు సతీశ్ బాబు పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వై.ఎ స్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో చోటుచేసుకున్న ఎమ్మార్ కుంభకోణంలో మొయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్‌ను ఈడీ నిందితుడిగా చేర్చింది. నాటి సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఖురేషీ మధ్య మెసేజీల్లో ప్రదీప్ కోనేరు, సతీశ్ బాబుల ప్రస్తావన ఉంది. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో, అంతకు ముందు ఈడీ కేసులో సతీశ్ పేరు ఉంది.