చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ని, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జగన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. బీసిలకు అన్యాయం జరగకుండా, కేంద్రం ఇచ్చిన 10 శాతం అగ్రవర్ణాల రిజర్వేషన్లో, కాపుల జనాభాను బట్టి, చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అది రాజకీయంగా తమకు ఇబ్బంది అని తెలిసినా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అనుకున్నట్టే, అది రాజకీయంగా ఇబ్బంది అయ్యింది. కాపులను దగ్గరకు తీస్తున్నారని, అటు బీసిలు దూరం అయ్యారు. మా పవన్ అన్న ఉన్నాడు అంటూ, కాపులు అటు వెళ్లారు. దీంతో చంద్రబాబుకు భారీ రాజకీయ దెబ్బ తగిలింది. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే, కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అని నిర్ణయం తీసుకున్నారు.

mudragada 29072019 2

అప్పటి నుంచి అందరి కళ్ళు ముద్రగడ మీదే ఉన్నాయి. చంద్రబాబుని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన ముద్రగడ, ఇప్పుడు జగన్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారా అనే అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుని ప్రతి రోజు ఇబ్బంది పెట్టిన విధంగా, ఈ రోజు కూడా ఆయన వైఖరి ఉంటుందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ, ఈ రోజు జగన్ కు ఒక లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌లో, 5 శాతం కాపులకు ఇవ్వటానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాని అది అమలు చేయడానికి కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, ఈ రిజర్వేషన్ ఇవ్వలేక పోతున్నాం అని, జీవో కూడా ఇచ్చారని పత్రికల్లో చూసాను, ఈ 5 శాతం రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఏ గౌరవ కోర్టు చెప్పింది, ఏ కోర్ట్ లో కేసు ఉందొ తమరు తెలిపితే సంతోషిస్తాను అంటూ లేఖలో ప్రస్తావించారు.

mudragada 29072019 3

నిజంగా అలాగే కోర్ట్ లో స్టే ఉంటే, మళ్ళీ ఎన్నికల వరకు మా డిమాండ్లు, హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటా, మేము మీ బానిసలు లాగా బ్రతకాలా ? హోదా పై మెడలు వంచుతా అని, ఇప్పుడు మడం తిప్పిన మీరు బానిసలుగా బ్రతుకుతూ, మా జాతి పై నీళ్ళు చల్లుతారా అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇదే లేఖలో షర్మిల విషయం కూడా ప్రస్తావించారు. "అయ్యా.. ఆ మధ్య తమరి సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో బూతులు ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు. వాటికి బెదిరిపోవడానికి నేనేమీ ఎన్ఆర్ఐను కాదండి. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను" అని ముద్రగడ లేఖలో రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read