కొత్తగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అమరావతి, పోలవరం, బందర్ పోర్ట్, ఇలా అతి పెద్ద ప్రాజెక్ట్ లే కాకుండా, చిన్న చిన్న పనులు కూడా ఆగిపోయాయి. మరో పక్క గతంలో కట్టినవి కూడా నిబంధనల పేరుతొ కూల్చేస్తున్నారు. మొన్నటి మొన్న ప్రజా వేదిక కూల్చివేత మన కళ్ళ ముందే కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మళ్ళీ నిబంధనల పేరుతో ఎత్తేసారు. పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు హయంలో మొదటి గేటు బిగించిన సంగతి తెలిసిందే. వరద వచ్చే అవకాసం ఉంది, గేటు ఉండకూడదు అంటూ, చంద్రబాబు హయంలో బిగించిన మొదటి గేటు ఎత్తేసారు. చంద్రబాబు హయంలో బెకమ్ కంపెనీకి పోలవరం గేటుల తయారీ పనులు అప్పచెప్పారు. మొత్తం 48 గేట్ల ఫ్యాబ్రికేషన్ వర్కు ఆ కంపెనీ పూర్తి చేసింది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, డిసెంబర్ 25 2018న మొదటి గేటు బిగించారు. పిల్లర్ల పని పూర్తయితే మిగతా వాటిని బిగించేయవచ్చనే అంచనాతో పనులు సాగాయి. అయితే ఎన్నికల కోడ్ రావటం, ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రబాబు హయంలో బిగించిన ఆ ఒక్క గేటు కూడా ఎత్తేసారు. వరదలు సాకుగా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, అంత ఎత్తున వరదలు వచ్చే అవకాసం ఉండదని, పోలవరంలో చంద్రబాబు ముద్రను చేరిపెయటానికి చేసే ప్రయత్నాలు అని చెప్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఇగోకి, స్పిల్ వే కూడా చంద్రబాబు హయంలో కట్టింది కాబట్టి, దాన్ని కూడా పడగొట్టి, మళ్ళీ కడతారేమో అని అంటున్నారు.
ఇక మరో పక్క పోలవరంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నవయుగ కంపెనీ ఇప్పటికే అక్కడ నుంచి భారీ యంత్రాలను తరలించేసింది. చిన్న చిన్న పనులు తప్ప అక్కడ ఏమి జరగటం లేదు. వర్షాల వల్ల ఆపేసాం అని చెప్తున్నా, ప్రభుత్వం మళ్ళీ టెండర్లు పిలుస్తుంది, కాంట్రాక్టర్ ను మార్చేస్తుంది అనే వార్తలు రావటం, ఏ పనులు జరగటం లేదు. మరో పక్క, త్రివేణి సంస్థ ఇప్పటికే పోలవరం సైట్ ఖాళీ చేసింది. నవయుగ సంస్థ మాత్రం, పూర్తిగా వెళ్లకపోయినా, భారీ యంత్రాలు తరలించింది, అలాగే కార్మికులను కూడా వేరే సైట్ లకు తరలించేసింది. పోలవరం పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనంత వరకు, ఏ పని జరిగే అవకాసం లేదు. జగన్ మోహన్ రెడ్డి, నేను రివర్స్ టెండరింగ్ కు వెళ్తాను అంటే, కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఒక వేళ కేంద్రం ఒప్పుకోకపొతే, ఇక పోలవరం సంగతి కూడా మర్చిపోవచ్చు.