జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. బిజినెస్ వర్గాలు కలవరపాటుకు గురి చేసే నిర్ణయాలతో, రాష్ట్రం పై నెగెటివ్ ఇమేజ్ వచ్చేలా నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల పై అటు కేంద్రం వద్దు, అది తప్పు అంటున్నా, వాటిని సమీక్షిస్తాం, మా మాట వినకపోతే ఒప్పందాలు రద్దు చేస్తాం అని బెదిరింపు ధోరణిలో వెళ్తుంది. మరో పక్క, జగన్ తీసుకున్న మరో నిర్ణయం పై కూడా దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఏకంగా నీతి ఆయోగ్ చైర్మెన్ కూడా, ఆ నిర్ణయం తప్పు అని అర్ధం వచ్చేలా, పత్రికా కధనాన్ని ట్వీట్ చేసారు అంటే, ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, వాటి పర్యావసానాలు ఎంతో తెలియచేస్తున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గటం లేదు అనుకోండి, అది వేరే విషయం.

nitiaayog 29072019 2

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టె, ఏ కంపెనీ అయినా సరే, 75 శాతం ఉద్యోగాలు అక్కడ స్థానికులకే ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. దీని పై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ఫైనాన్షియాల్ ఎక్ష్ప్రెస్ లో వచ్చిన ఒక కధనాన్ని పోస్ట్ చేస్తూ, ఆ పత్రికలో వచ్చిన ఒక వ్యాఖ్యం పోస్ట్ చేసారు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ, ఏపి తెచ్చిన ఈ బిల్, మన దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ప్రతి పౌరుడికి, ఈ దేశంలో, ఎక్కడైనా జీవించే హక్కు, పని చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, ఈ బిల్ దానికి విరుద్ధం అని, పెట్టుబడులు పెట్టె వాతావరణానికి, ఇది అద్దంకిగా ఉంటుంది, ఫైనాన్షియాల్ ఎక్ష్ప్రెస్ చెప్పిన ఆ వాఖ్యాన్ని, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్వీట్ చేసారు.

nitiaayog 29072019 3

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్ పై జగన్ మోహన్ రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్‌ స్పందించారు. ‘‘బిల్లును మీరు పూర్తిగా చూడలేదని, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. స్థానికులకు అవకాశం కల్పించాలన్నదే మా ఉద్దేశం. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఆలోచన లేదు. బిల్లు మాత్రమే పెట్టాం. నిబంధనలు చూడండి’’ అని రమేష్‌ కౌంటర్ ఇచ్చారు. దీనికి మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇచ్చారు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌. అది పత్రికల్లో వచ్చిన వార్తా, అందుకే కోటేషన్స్ లో పెట్టాను చూసుకోండి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఒక పక్క 75 శాతం లోకల్ రిజర్వేషన్ పై, పెద్ద పెద్ద కంపెనీలు అందరూ వ్యతిరేకిస్తుంటే, ఇప్పుడు ఏకంగా, ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ట్వీట్ చెయ్యటం చర్చనీయంసం అయ్యింది. అంటే ఈ విషయంలో కేంద్రం కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించటం లేదు అని అర్ధం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read