జగన్ ప్రభుత్వానికి రోజుకి ఒక పవర్ షాక్ తగులుతాంది. చంద్రబాబు ని టార్గెట్ చేసుకుంటూ , గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చేస్తాను అంటూ జగన్ ప్రకటించారు. అయితే ఇలా చెయ్యటం చాలా తప్పు అని, పెట్టుబడి దారులు, వెళ్లిపోతారని, కేంద్రం నుంచి బిజినెస్ అనలిస్ట్ ల దాకా అందరూ హెచ్చరించినా, జగన్ మాత్రం ముందుకే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న గ్రీన్ కో కంపెనీ షాక్ ఇస్తే, నిన్న కేంద్ర సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. తాజగా మరో కేంద్ర సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), జగన్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసింది. మీరు అడిగిన రేట్ కు మేము కరెంట్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నామో, ఆ ఒప్పందం మేరకే సరఫరా చేస్తామని, అంతకు మించి రూపాయి కూడా తగ్గించే ప్రసక్తే లేదని, తేల్చి చెప్పారు.
ఒప్పందం చేసుకున్న సమయంలో, అన్నీ పారదర్శకంగా జరిగాయని, అప్పటి మార్కెట్ ధరల్లో అతి తక్కువ బీడ్లను పిలిచామని అన్నారు. ఈ బిడ్ల విధానాన్ని, జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా మేచ్చుకుందని అన్నారు. ఇవన్నీ మీరు పరిశీలించకుండ, మీ ఇష్టం వచ్చిన రేట్ ఇవ్వమంటే మాకు కుదరదని అన్నారు. దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం రేట్లు తగ్గించమంటూ రాసిన లేఖకు, ఈ నెల 17వ తేదీన ఎన్టీపీసీ (కమర్షియల్-రెన్యువబుల్ ఎనర్జీ) ఏజీఎం ఐ.ఉప్పల్ సమాధానం ఇచ్చారు. దాదపుగా నాలుగు పేజిల ఈ లేఖలో, అన్ని వివరాలు స్పష్టం చేసారు. వివధ రాష్ట్రాల్లో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అన్నీ పరిశీలించాకే, ఆంధ్రప్రదేశ్‌కు 1250 యూనిట్లను ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని కేటాయించామని అన్నారు.
కర్నూలు అలా్ట్రమెగా సోలార్ పార్కులో 500 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు చెయ్యటానికి, బిడ్లు పిలిస్తే, 28 మంది వచ్చారని, 27 మంది క్వాలిఫై అయ్యారని, రివర్స్ టెండరింగ్ చేసి, యూనిట్ ధర రూ.4.63కు ఉత్పత్తి చేసేందుకు వచ్చిన బిడ్దర్ ను ఒకే చేసామని చెప్పారు. అలాగే మిగతా సాంకేతిక అంశాలు అన్నీ ఆ లెటర్ లో రాసారు. ఒప్పందాలు అన్నీ మంచిగానే జరిగాయని, దాని పై అనవసరం రాద్ధాంతం చెయ్యద్దు అని అన్నారు. మేము మాత్రం, మీరు కోరిన రేట్ కు కరెంటు ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. మేము ఒప్పందం చేసుకున్న రేట్ కే సరఫరా చేస్తామని, ఇష్టం ఉంటె తీసుకోండి, లేకపోతె లేదు అన్నట్టు లేఖ రాసారు. మొత్తానికి జగన్ విధానాల వల్ల, విద్యుత రంగంలోని పెట్టుబడిదారులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. జగన్ గారి సండూర్ పవర్ కు మంచి రోజులు వచ్చాయనే అనుకోవాలి. చూద్దాం కేంద్రం ఏమి చేస్తుందో.