జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, చెప్పిన మాట పొదుపు. చంద్రబాబు ఎన్నో దుబారా ఖర్చులు పెట్టారు, నేను అలా దుబారా ఖర్చులు పెట్టను, నా జీతం ఒక్క రూపాయి, నేను కిన్లే వాటర్ మాత్రమే తాగుతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ విన్న ప్రజలు, అబ్బో , గొప్ప మార్పు చూడబోతున్నాం అంటూ, ఎంతో సంబర పడ్డారు. దానికి తగ్గట్టుగానే, ప్రమాణస్వీకారానికి కేవలం 26 లక్షలు ఖర్చ్ అయ్యింది అంటూ, ఎదో జీఓ చూపించి హడావిడి చేసారు. నిజానికి అది అడ్వాన్సు ఇచ్చినట్టు జీఓలో ఉంది. అయినా సరే, ప్రజలు మాత్రం, జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చులు పెట్టరు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం జగన్ కు ఉంది. మాట ఇస్తే మాట తప్పరు అని చెప్తారు కదా అని అనుకుంటూ, ప్రజా ధనం ఇక మొత్తం ఆదా అయిపోతుంది అని అనుకున్నారు.

indiatoday 23072019 2

అయితే రెండో రోజు నుంచే జగన్ షాక్లు మీద షాక్లు ఇవ్వటం మొదలు పెట్టారు. ముందుగా తన హెలిప్యాడ్ కోసం, 42 ఇళ్ళను లేపెసరని వార్తలు వచ్చాయి. తన ఇంటి దగ్గర నుంచి, హెలిప్యాడ్ దగ్గరకు, 1.5 కిమీ రోడ్డు వెయ్యటానికి ౧౦ కోట్లు జీఓ ఇచ్చారు. తరువాత తన ఇంటి దగ్గర బ్యారికేడ్ లకు అని 75 లక్షలు విడుదల చేస్తూ జీఓ ఇచ్చారు. తరువాత తన ఇంటి ఆవరణలో టాయిలెట్లు కట్టాలని 35 లక్షలు జీఓ విడుదల చేసారు. తరువాత, తన ఇంటిలో కరెంట్ పని చెయ్యటానికి అని, 9 నెలలకు, 8.5 లక్షలు విడుదల చేసారు. అంటే, కరెంట్ పని చెయ్యటానికి, నెలకు లక్ష రూపాయాలు అన మాట. సరే ఇవన్నీ అంటే ముఖ్యమంత్రి ఇంటి కోసం, ఆయన భద్రత కోసం కదా, కొంచెం రేట్లు ఎక్కువైనా పర్లేదులే, పాపం నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నారు కదా అని ప్రజలు అనుకుంటున్న టైంలో మరో షాక్ ఇచ్చారు.

indiatoday 23072019 3

ఆయనకు హైదరాబాద్ లో ఉంటున్న లోటస్ పాండ్ కోసం, నిన్న 24.50 లక్షలు విడుదల చేస్తూ జీఓ విడుదల చేసారు. అక్కడ బ్యాగేజ్ చెకింగ్ రూమ్,సీసీటీవీ రూమ్,స్టాటిక్ రూమ్‌లతో పాటు, బ్యారికేడ్ లు పెట్టాతనికి, ఈ డబ్బులు రిలేజ్ చేసారు. ప్రజల సొమ్ముతో ఎక్కడో హైదరాబాద్ లో ఉండే, జగన్ ఇంటికి సోకులు ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు బెంగుళూరు ప్యాలెస్ కోసం, ఇడుపులపాయ ఎస్టేట్ కోసం, కడప ఇంటి కోసం కూడా ఇలాగే విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. అయితే ఈ దుబారా ఖర్చుల పై నేషనల్ మీడియా కూడా ఉతికి ఆరేసింది. ప్రజల సొమ్ముతో జగన్ సోకులు చేసుకుంటున్నారంటూ, నేషనల్ మీడియా వాయించి పెట్టింది. మొత్తానికి, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా అని చెప్పిన జగన్ గారు, 50 రోజుల్లోనే చేసి చూపించారని, తెలుగుదేశం విమర్శిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read