"మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా ?".. ఈ డైలాగ్ గుర్తుందా ? జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోది. హీరోని ఉద్దేశించి, దెబ్బ తిన్న విలన్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్, మన అసెంబ్లీ జరుగుతున్న తీరు, దాంట్లో ఉన్న అచ్చెన్నాయుడుకి సరిగ్గా సరిపోతుంది. అటు వైపున 151 మంది అధికార పక్ష నేతలు. ఇటు వైపు కేవలం 23 మంది. అందులో నుంచి ఒకే ఒక్కడు, ధీటుగా నిలబడి, శ్రీకాకుళం యాసలో, 151 మందికి సమాధానం చెప్తుంటే, ఆ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ లీడర్ హోదాలో, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు చూపిస్తున్న తెగువ అంతా ఇంతా కాదు. ప్రతి సమస్య పైనా, అచ్చెన్నాయుడు లెగిసి ప్రశ్నలు అడుగుతుంటే, ఆయనకు సమాధానం చెప్పలేక పోతుంది అధికార పక్షం.
అందుకే సమాధానం చెప్పలేక, ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి, అచ్చెన్నాయుడుని మానసికంగా దెబ్బ కొట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే, నిండు సభలో, నువ్వు చంద్రబాబు నాయుడు బంట్రోతివి అని అధికార పక్ష సభ్యులు అంటే, దానికి కుంగిపోలేదు అచ్చెన్నాయుడు. నేను చంద్రబాబు బంట్రోతుని అయితే, మీ 150 మంది జగన్ మోహన్ రెడ్డి బంట్రోతులా అని ప్రశ్నిస్తే, ఒక్కరికి కూడా సౌండ్ లేదు, కౌంటర్ లేదు. ఇక ఏకంగా సాక్షాత్తు, జగన్ మోహన్ రెడ్డి లెగిసి, ఏ అచ్చం, నీకు బాడీ ఇంత పెరిగింది కాని, నీ బుర్ర పెరగలేదు అంటూ, ఒక శాసనసభ్యుడుని బడీ షేమింగ్ చేసారు. ఇలా అయినా అచ్చెన్నాయుడు కాంగా ఉంటారని అనుకున్నారు. కాని అచ్చెన్నాయుడు అంతే ధీటుగా, నాకు కనీసం బడీ అయినా పెరిగింది, మీకు బడీ లేదు, బుర్రా లేదు అని చెప్పటంతో, ఇప్పటికీ దాని పై మళ్ళీ నోరు ఎత్తలేదు.
ఇక మరో సందర్భంలో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు పక్కనే కుర్చుని ఉండటంతో, అది కూడా అచ్చెన్నాయుడుని టార్గెట్ చెయ్యటానికి, అధికార పక్షం వాడుకుంది. అది అచ్చెన్నాయుడు ప్లేస్ కాదని, అక్కడ నుంచి పంపించి, వేరే చోటు కూర్చోబెట్టారు. ఒకే డిప్యూటీ లీడర్, ప్రతిపక్ష నాయకుడి పక్కన కూర్చో కూడదు అని తీర్మానించారు. ఇన్ని అవమానాలు భరిస్తున్నా, అచ్చెన్నాయుడు మాత్రం ఎక్కడ తొణకలేదు. ధీటుగా 151 మందికి సమాధానం చెప్తున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుని ఎలా అయనా సభ నుంచి తప్పించాలని, అధికార పక్షం పూనుకుంది. ఈ రోజు జగన హామీ అయిన 45 ఏళ్ళకే, 2 వేల పెన్షన్ పై, ప్రశ్న అడిగినందుకు, అచ్చెన్నాయుడుని ఈ సమావేశాలు ముగిసే దాకా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు. ఇలా ఆపరేషన్ అచ్చెన్నాయుడుని సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు.