నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో, 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ అని జగన్ హామీ ఇచ్చారు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అడిగినందుకు, సరైన సమాధానం రాకపోవటంతో, మాకు మాట్లాడే అవకాసం ఇవ్వాలి అని కోరినందుకు, తెలుగుదేశం శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్లగా ఉన్న ముగ్గురిని సభ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ముగిసేదాకా జగన్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రశ్న అడిగితేనే సస్పెండ్ చేస్తారా అంటూ నిన్న మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన తెలియచేసి వాక్ అవుట్ చేసారు. అచ్చెంనాయుడు ఆయన స్థానంలో నుంచున్నా కూడా, ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలని, నిన్న స్పీకర్ ను కలిసి, సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు. అయినా ప్రభుత్వం ఏమి స్పందించలేదు.

cbn 24072019 2

దీంతో ఈ రోజు అసెంబ్లీ ప్రారంభానికి ముందు, తెలుగుదేశం నేతలు మెరుపు ధర్నా చేసారు. చంద్రబాబు కూడా ఈ ధర్నాలో పాల్గునటంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నేలకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అలెర్ట్ అయిన పోలీసులు, మీడియాను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే మార్గంలో మిగతా నేతలు వస్తారని, జగన్ కూడా ఇటే వస్తారాని, అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా తెలుగుదేశం నేతలు అసెంబ్లీ మొదలయ్యే వరకు, అక్కడే ఆందోళన చేసారు. ఎందుకు సస్పెండ్ చేసారో కనీసం చెప్పకుండా సస్పెండ్ చేసారని, ప్రశ్న అడిగినందుకు సస్పెండ్ చెయ్యటం అన్యాయమని చంద్రబాబు అన్నారు.

cbn 24072019 3

తమ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఊరు ఊరు తిరిగి మీరు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తే, అన్యాయంగా బయటకు నెట్టేస్తారా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డికి అసహనం పెరిగిపోయిందని, పోడియం వద్ద కు వెళ్లని టీడీపీ సభ్యులనూ సస్పెండ్‌ చేశారని అన్నారు. ఇది ఇలా ఉంటె, ఈ రోజు కూడా ఉదయం ఉంచి తెలుగుదేశం పార్టీ ఎంత అడిగినా మైక్ ఇవ్వలేదు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం 12500 అని జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 12500 కాదని, 6500 అని, కేంద్రం ఇచ్చే 6 వేలు అదనం అని చెప్తున్నారు. దీని పై చంద్రబాబు లెగిసి నుంచుని మైక్ ఇవ్వమని అడిగినా మైక్ ఇవ్వలేదు. దీంతో నిరసన తెలియచేస్తూ, సభ నుంచి తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read