ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ మొదలైన దగ్గర నుంచి, చంద్రబాబు ఎంత టార్గెట్ చేస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంత ఎగతాళి చేస్తున్నా, చంద్రబాబు మాత్రం ఎక్కడ బ్యాలన్స్ తప్పటం లేదు. నేను ప్రజల సమస్యల పై పోరాడుతూనే ఉంటా, మీరు ఎన్ని చేసినా, నాకు ఏమి పర్వాలేదు అంటూ చంద్రబాబు చెప్పారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు వైసిపీ నేతల ప్రవర్తన మరీ ఎక్కవై పోయింది. చంద్రబాబు నాయుడు పై, మైక్ తీసుకుని మరీ దౌర్జన్యం చేస్తూ, ఖబర్దార్, ఖబర్దార్ అంటూ కనీసం పది సార్లు అంటూ బెదిరింపులు దిగారు. మైక్ లో అలా ఖబర్దార్ అంటూ ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని బెదిరిస్తున్నా, డిప్యూటీ స్పీకర్ మాత్రం, అలా చూస్తూ ఉండి పోయారు కాని, అలా అనకూడదు అని మాత్రం చెప్పలేదు.
ఈ రోజు అసెంబ్లీలో 45 ఏళ్ళకే, 2 వేల పెన్షన్ అంటూ, జగన్ చేసిన హామీ పై, జగన్ వెనక్కు తగ్గటం పై, తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఈ సమయంలో, మైక్ అందుకున్న వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుని బెదిరిస్తూ, దౌర్జన్యం చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఎంతో పౌరుషంగా, ‘చంద్రబాబు నాయుడు ఖబర్దార్..మీ సభ్యులకు చెప్పు.. ఖబర్దార్ చంద్రబాబు’ అంటూ ఒకటికి పది సార్లు ఈ వ్యాఖ్యలు చేసారు. ఆయాన ఎమోషన్ చూసి, చంద్రబాబుని ఏమైనా భౌతికంగా దాడి చేస్తారా అన్నంతలా అనిపించింది. చెప్పిన హామీ గురించి, ఎప్పుడూ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు, వైసిపీ నేతలు సమాధానం లేక, ఇరుక్కు పోయాం అని తెలుసుకుని, ముందుగా టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు.
తరువాత చంద్రబాబు పై దూషణలకు, బెదిరింపులకు దిగారు. చంద్రబాబు మాత్రం, మీ లాంటి వారిని ఎంతో మందిని చూసా, ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. మరో పక్క సభలో వైసిపీ వైఖరి, తమకు మైక్ ఇవ్వకపోవటం పై టిడిపి సభ్యులు నిరసన తెలిపారు. ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పట్ల నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడి పై సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలుగుదేశం సభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కోరారు. అయితే ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లగా, జగన్ తో చర్చించి తమ చెప్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.