జగన్ మోహన్ రెడ్డి అవగాహన లోపం, తన సహజ లక్ష్యణం అయిన కక్ష తీర్చుకునే ధోరణితో, ఇటు రాష్ట్రానికే కాదు, అటు దేశానికి కూడా తీవ్ర నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన సూచనల మేరకు, దేశాలు అన్నీ థర్మల్ విద్యుత్ వదిలి, సౌర, పవన విద్యుదుత్పత్తి వైపు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడలును ప్రోత్సహించింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా, వీటికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో, చంద్రబాబుని ఎదో ఒక కేసులో ఇరికించాలి అని చూస్తున్న జగన్, అన్ని రంగాల్లో సమీక్షలు, ఎంక్వైరీలు వేస్తున్నారు. అయితే విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాల పై సమీక్షకు మాత్రం, అనాలోచితంగా చేస్తున్నారు.

crisil 24072019 2

అటు కేంద్రం కాని, ఇటు వివిధ సంస్థలు కాని, అలా చెయ్యటం తప్పు, దాని వల్ల పెట్టుబడి దారులు వెళ్ళిపోతారు, భారీగా జరిమానాలు కట్టాలి అని హెచ్చరిస్తున్నా, జగన్ మాత్రం,వితండవాద ప్రవర్తనతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రముఖ రేటింగ్‌, మార్కెట్‌ విశ్లేషణ సంస్థ ‘క్రిసిల్‌ రేటింగ్స్’ కూడా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం వల్ల, సౌర, పవన విద్యుదుత్పత్తి రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, ‘క్రిసిల్‌’ పేర్కొంది. దీని పై మంగళవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో, పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా పెట్టుబడులు రావని హెచ్చరించింది.

crisil 24072019 3

జగన్ నిర్ణయంతో విసుగు చెంది, ఈ కంపెనీలు కోర్ట్ కు వెళ్ళితే, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించింది. పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుంది. కంపెనీలకు డిస్కమ్‌ల నుంచి చెల్లింపులు ఇంకా ఆలస్యమవుతాయి. ఇప్పటికే నిధులు లేక ఇబ్బంది పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ చర్యలతో పునరుత్పాదక విద్యుత్తు రంగం దెబ్బతింటుందని, ఇవన్నీ ఆలోచించి, దీని పై తగిన విధంగా ముందుకెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని క్రిసిల్‌ హెచ్చరించింది. ఒక వేళ అలా కుదరదు, మా ఇష్టం అంటే ఈ రంగం పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారని, అదే కనుక జరిగితే 2022 నాటికి దేశంలో మొత్తం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవేరదని హెచ్చరించింది. మరి ఇప్పటికైనా జగన్ గారు, తగ్గుతారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read