విజయవాడ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయి. మొన్నటి దాక సొంత పార్టీ నేతలు, కేశినేని నాని, బుద్దా వెంకన్న ట్వీట్ వార్ తో, మొన్నటి దాకా విజయవాడ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అయితే గత వారం రోజులుగా అది తగ్గింది అనుకుంటే, మళ్ళీ ట్వీట్ వార్ కి, వైసిపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ ఎంటర్ అయ్యారు. కేశినేని నాని పై ట్వీట్ల వర్షం కురిపించారు. దానికి కేశినేని నాని కూడా ధీటుగా బదులు ఇస్తూ వచ్చారు. మొన్న కేశినేని నాని నన్ను దొంగ అన్నారు అంటూ, లీగల్ నోటీస్ కూడా పీవీపీ పంపించారు. ఇదే సందర్భంలో కేశినేని నాని ట్రావెల్స్ మూసేసే టైంలో వందలాది మంది కార్మికులకు జీతాలు ఎగ్గోట్టారని, వారికి ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడు అంటూ పీవీపీ ట్వీట్ చేసారు. దీనికి నాని ధీటుగా బదులు ఇస్తూ, నేను ఎవరికీ బాకీ లేను అని, అందరికీ సెటిల్ చేసానని చెప్పారు.

nani 26072019 2

ఈ క్రమంలోనే, ఈ రోజు కేశినేని నాని ట్రావెల్స్ కు చెందిన మాజీ ఉద్యోగులు కొంత మంది విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నాకు దిగారు. వారికి పీవీపీ మద్దతు ఇచ్చారు. కేశినేని నాని మూడేళ్ళ నుంచి తమకు బకాయి పడ్డ జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ మూసినప్పటి నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని అన్నారు. మేము లేబర్ కోర్ట్ లో కూడా కేసు వేశామని అన్నారు. మాకు రావాల్సిన బకాయాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే ఇదే అంశం పై పీవీపీ స్పందిస్తూ నాని పై రాజకీయ విమర్శలు చేసారు. దీంతో ఈ అంశం మొత్తం వెనకాల, పీవీపీ ఉండే కధ నడిపిస్తున్నారని అర్ధమైంది. ఇదే క్రమంలో నాని అనుచరులు, ధర్నా చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు, ఎవరికి ఇవ్వాలని, ఎంత ఇవ్వాలి అనే విషయం పై ఆరా తీసేందుకు వెళ్తే, వారిని అక్కడ నుంచి పోలీసులు పంపించి వేసారు.

nani 26072019 3

ఈ అంశం పై కేశినేని నాని స్పందిస్తూ, తమ సంస్థలో 2వేలకు మంది పైగా ఉద్యోగాలు ఉండేవారని, 2017లో ట్రావెల్స్ మూసిన సమయంలో అందరికీ బకయాలు సెటిల్ చేసి, వారిని పంపించేసమని అన్నారు. కేవలం 14 మంది విషయంలో తేడా ఉందని, వారు లేబర్ కోర్ట్ కు వెళ్ళారని, కోర్ట్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారు. ఈ లోపే ఇలా ఎందుకు చేసారో, ఎవరి వల్ల చేసారో అందరికీ కనిపిస్తుందని అన్నారు. ఆ 14 మంది కాకుండా, ఇంకా ఒక్కరినైనా చూపిస్తే, తాను వారికి కూడా ఇవ్వాల్సింది ఏమైనా ఉంటె ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 14 మందితో తేడా వచ్చిందని, వారు కోర్ట్ కు వెళ్తే, వాళ్ళని ఇక్కడకు తీసుకొచ్చి, డ్రామాలు ఆడిస్తున్నారని, ఎవరో ట్వీట్ లకు నేను సమాధానం చెప్పను అని, పీవీపీ ని ఉద్దేశించి అన్నారు. ఈ 14 మంది విషయంలో కోర్ట్ ఏమి చెప్తే అది చేస్తామని నాని స్పష్టం చేసారు. 2017 ఏప్రిల్ 7న, తన ట్రావెల్స్ పై జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేస్తుంటే, ఆ మాటలు పడలేక, కేశినేని ట్రావెల్స్ మూసేసిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read