ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం, చంద్రబాబు వాహనం లోపలకి అనుమతిచం అని చెప్పటంతో, చంద్రబాబు గేటు దగ్గరే దిగి రాజ్ భవన్ లోపలకి నడుచుకుంటూ వెళ్లారు. ప్రమాణస్వీకరం ముగిసిన తరువాత, గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు వెళ్ళిపోవటంతో, చంద్రబాబుకు గవర్నర్ కలసి అభివాదం చేసే అవకాసం కూడా దొరకలేదు. దీంతో చంద్రబాబు నిన్న గవర్నర్ వద్దకు ప్రత్యేకంగా వెళ్లి కలిసి, గవర్నర్ గా నియమితులు అయినందుకు అభినందించారు.
చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల, చినరాజప్ప, పయ్యావుల, డొక్కా మాణిక్యప్రసాద్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు వారందరినీ గవర్నర్ కు పరిచయం చేసారు. ఈ భేటీలోనే గవర్నర్ హరిచందన్, తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని తెలుగుదేశం నేతలతో పంచుకున్నారు. మొదటిసారిగా ఎన్టీఆర్ ను భవనేశ్వర్ ఎయిర్పోర్టులో కలిసానని, ఆయన ఒక మహా శక్తిగా ఎదిగిన తీరు అద్భతం అని కొనియాడారు. గతంలో కొన్ని సందర్భాల్లో విజయవాడ వచ్చానని, ఆ విశేషాలు కూడా పంచుకున్నారు. ఇదే సందర్బంలో చంద్రబాబుకు బిజూపట్నాయక్తో తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే తరువాత, గవర్నర్, చంద్రబాబు ఏకాంతగా మాట్లాడుకోవటం రాజకీయంగా చర్చనీయంసం అయ్యింది. దాదాపుగా 15 నిమషాలకు పైనా, ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
రాష్ట్రంలో తాజా రాజకేయ పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించి ఉంటారని తెలుస్తుంది. బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏరి కోరి బీజేపీ మన రాష్ట్రానికి పంపించింది. కొద్ది రోజుల క్రిందట, మోడీ ఆయన్ను పిలిచి, మీకు పెద్ద బాధ్యత ఇవ్వబోతున్నా అని చెప్పారు. అంటే గవర్నర్ ద్వారా, రాష్ట్రంలో బలపడే ప్లాన్ లో బీజేపీ ఉంది. అంతే కాదు, బిశ్వభూషణ్ హరిచందన్ అవినీతి లేని సమాజం కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న మనిషి. బీజేపీ-బీజేడీ సంకీర్ణంలో ఆయాన మంత్రిగా పని చేసిన సమయంలో, అవినీతిని నిర్మూలించే చర్యలు తీసుకున్నారు. జగన్ పై ఉన్న కేసులు దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆయన వైఖరి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు ఆయనతో ఏకాంతంగా భేటీ కావటం కూడా రాజకీయంగా ఆసక్తి రేపే అంశం. గత గవర్నర్ నరసింహన్ మొదటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన కు అనుకూలంగా పని చేసారనే అభిప్రాయం ఉండేది. మరి కొత్త గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.