చంద్రబాబు టార్గెట్ గా విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై , జగన్ మొండి వైఖరి పై అటు కోర్ట్ ల నుంచి, ఇటు బిజినిస్ అనలిస్ట్ లు దాకా, అందరూ విమర్శలు గుప్పిస్తూ, హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం తన పంధా మార్చుకోవటం లేదు. ఇప్పటికే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఈ విషయం పై జగన్ కు లేఖ రాసారు. అయినా జగన్ వినలేదు. తరువాత కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి జగన్ కు లేఖ రాసారు. అయినా జగన్ వినటం లేదు. మరో పక్క విద్యుత్ సంస్థలు కోర్ట్ లకు వెళ్తున్నాయి, ట్రిబ్యునల్ దగ్గరకు వెళ్తున్నాయి. ఏదైనా తేడా జరిగితే, ప్రభుత్వానికి భారీగా జరిమానా పడే అవకాసం ఉంటుంది. అందుకే ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో జగన్ వ్యవహార శైలి పై, కేంద్ర విద్యుత శాఖా మంత్రి, ఆర్‌కే సింగ్‌, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు.

shah 27072019 2

విద్యుత్ ఒప్పందాల విషయంలో సమీక్ష చేస్తే అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నా, జగన్ వినిపించుకోవటం లేదని, మీ జోక్యం కావాలని, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి, అమిత్ షా ను కోరారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో, ఆంధ్రప్రదేశ్ లోనే కాదని, దేశంలోనే పెట్టుబడుల వాతావరణం దెబ్బ తింటుందని, అమిత్ షాకు వివరించారు. ఇప్పటికే తమ శాఖ కార్యదర్శి, నేను కూడా , జగన్ మోహన్ రెడ్డికీ, లేఖలు రాసి అంతా వివరించామని, అయినా జగన్ ముందుకు వెళ్తున్నారని అమిత్ షా కు తెలిపారు. విద్యుత్ ఒప్పందాలు పూర్తిగా రెగ్యులేటరీ అథారిటీ చేస్తుందని, దీంట్లో రాష్ట్రానికి, కేంద్రానికి కూడా సంబంధం ఉండదని, చెప్పినా, జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఇప్పటికే కోర్ట్ ల వరకు వీ విషయం వెళ్లిందని, ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకపొతే, దేశానికే ఈ రంగంలో పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదం ఉందని, కేంద్ర విద్యుత్ మంత్రి, అమిత్ షా కు వివరించారు.

shah 27072019 3

ఈ వివాదం మరింత ముదరకుండా, ఉన్నత స్థాయిలో రాజకీయ జోక్యం కోసమే, కేంద్ర మంత్రి, అమిత్ షా కు చెప్పారని, అధికారులు అంటున్నారు. ఇప్పటికే అనేకసార్లు జగన్ కు చెప్పి చూసామని, సాక్షాత్తు కేంద్ర మంత్రి, కేంద్రం తరుపున, అన్ని ఆధారాలు ఇచ్చారని, అంతా వివరంగా చెప్పారని, అయినా జగన్ వినకపోవటంతో, ఈ విషయం అమిత్ షా వరకు వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. జగనే మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, అమిత్ షా ఈ దేసంలూ, రెండో పవర్ ఫుల్ మ్యాన్ అని, మరి ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయం వెనక్కు తీసుకుంటారో లేదో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read