జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, బహుసా కోర్ట్ లలో ఇదే మొదటి ఎదురు దెబ్బ అయ్యి ఉంటుంది. జగన్ అనాలోచితంగా, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని తీసుకున్న నిర్ణయాలతో, ఈ రోజు ఆయాన ప్రభుత్వానికి హైకోర్ట్ లో మొట్టికాయలు పడే పరిస్థితి వచ్చింది. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో చంద్రబాబు అవినీతి చేసారని, ఆయన్ను జైలుకి పంపిస్తా అంటూ జగన్ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు కోర్ట్ లో, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా చేసింది. కేంద్రం చెప్పినా, బిజినెస్ అనలిస్ట్ లు చెప్పినా, ఫిచ్ రేటింగ్స్ చెప్పినా, క్రిసిల్ రేటింగ్ హెచ్చరించినా, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించినా, అక్కడ చంద్రబాబుని ఎదో చేసేయాలి అని తపనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది.

ppa 25072019 2

విద్యుత్ పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) మళ్ళీ సమీక్షించాలని జగన్ ప్రభుత్వం జారీ చేసిన, జీవో నెం. 63ను హైకోర్ట్ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. అంతే కాదు విద్యుత్ ఒప్పందాల పై సంప్రదింపులకు రావాలని, వివిధ సంస్థలకు రాసిన లేఖలను కూడా హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఈ విషయం పై తదుపరి విచారణను ఆగష్టు 22కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్ట్ లో జగన్ ప్రభుత్వానికి తగిలిన మొట్టమొదటి ఎదురు దెబ్బగా ఇది నిలుస్తుంది. వారం రోజుల క్రితం ట్రిబ్యునల్ కు వెళ్ళిన గ్రీన్ కో కంపెనీకి అనుకూలంగా, ట్రిబ్యునల్ తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్ట్ వంతు వచ్చింది. జగన్ ప్రభుత్వ నిర్ణయం పై 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.

ppa 25072019 3

ఈ 40 కంపెనీలు, 14 పిటీషన్లు వేసాయి. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. వీటి పై జస్టిస్ ఎం.గంగారావు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ల పై విచారణ జరిపింది. విద్యుత్ ఒప్పందాల పై ప్రభుత్వం సమీక్ష చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, కోర్ట్ కు తెలిపాయి. ఇది విషయం పై కేంద్రం కూడా, జగన్ ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసి హెచ్చరించింది. ఇది సరైన విధానం కాదని, ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని చెప్పినా, జగన్ మొండిగా ముందుకు వెళ్లారు. కేంద్రాన్ని కూడా జగన్ ముందుకు వెళ్ళటంతో, ఇప్పుడు ఆయన అవగాహనా లోపంతో తీసుకున్న నిర్ణయంతో, హైకోర్ట్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇప్పటికైనా జగన్ ఆగుతారా, లేకపోతె కోర్ట్ ని కూడా ధిక్కరించి ముందుకు వెళ్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read