అమరావతిని ప్రేమిస్తూ, అమరావతిని ఉన్నతంగా చూడాలని కలలు కన్న వారికి నిజంగా ఇది షాకింగ్ న్యూస్.. గత 50 రోజుల నుంచి ప్రతి రోజు అమరావతి పై నెగటివ్ వార్తలేగా, ఇంకా షాకింగ్ ఏముంది అంటారా ? కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా, కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై ఆసక్తి చూపించకపోయినా, కొంత మందికి మాత్రం ఎక్కడో ఒక చిన్న ఆశ. అదే ప్రపంచ బ్యాంకు లోన్. ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుందని, వాటితో అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశ పడ్డారు. చంద్రబాబు లేక పోయినా, మా జగన్ అన్న అమరావతిని పూర్తీ చేసి చూపిస్తారని, కొంత మంది వైసిపీ నేతలు వాదించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. ప్రపంచ బ్యాంక్ షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు హయంలో 7200 కోట్ల రుణం ఇవ్వాలని సిఆర్డీఏ ప్రపంచ బ్యాంకుని కోరింది. మొదటి దశలో 3200 కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. దీనికి కేంద్రం ప్రభుత్వం కూడా సమ్మతం తెలిపింది. ప్రపంచ బ్యాంకు కూడా రుణం ఇవ్వటానికి రెడీ అయ్యింది. ఈ దశలో కొంత మంది వెళ్లి కంప్లైంట్ ఇవ్వటం, తరువాత లోన్ ప్రాసెస్ అంతా లేట్ అవ్వటం ఇవన్నీ మనకు తెలిసిందే. ఈ దశలో ప్రభుత్వం మారి, జగన్ వచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అమరావతి వచ్చి క్షేత్ర స్థాయిలో పర్యటించి , అభిప్రాయాలు తీసుకుని, అమరావతి లోన్ పై నిర్ణయం తీసుకుంటామని, క్షేత్ర స్థాయి పర్యటనకు పర్మిషన్ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ విషయం పై మాకు కొంత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకును కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏమనుకున్నారో ఏమో కాని, ఈ రోజు ప్రపంచ బ్యాంక్ వెబ్సైటులో, అమరావతి లోన్ స్టేటస్ దగ్గర, "డ్రాప్" అంటూ స్టేటస్ అప్డేట్ అయ్యి ఉంది. నిన్నటి వరకు, ఇన్ ప్రాసెస్ అని ఉండే చోట, ఈ రోజు డ్రాప్ అని ఉండటం చూసి, అమరావతి ప్రేమికులు అవాక్కయ్యారు. అమరావతి నిర్మాణంలో చివరి ఆశ అయిన ప్రపంచ బ్యాంకు కూడా చేతులు ఎత్తేసిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 కోట్లు కేటాయించింది, ఇక అమరావతి సంగతి ఏంటో అని బాధ పడుతున్నారు. జగన్ వస్తే అమరావతి ఆగిపోతుందని తెలిసినా, ప్రజలు ఓట్లు వేసారు కాదు, ప్రజలు ఇదే కావాలని కోరుకుంటున్నారు ఏమో అని, కొంత మంది నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉవ్వెత్తున లెగిసిన అమరావతి ఖ్యాతి, ఈ రోజు, కేవలం మూడు నెలల్లో పాతాళానికి పడిపోయింది.