జగన్ మోహన్ రెడ్డి అవగాహన లోపంతో రాష్ట్రానికి కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అతని అవగాహనా లేమి స్పష్టంగా కనిపిస్తుంది. భవనాలు కూల్చటం, విత్తనాలు సమస్య, కరెంట్ కష్టాలు, కేసిఆర్ ట్రాప్ లో పడి, మన ఆస్థులు ఇవ్వటం, ఇప్పుడు గోదావరి నీటి తరలింపు, తాజాగా విద్యుత్ పీపీఏల పై సమీక్ష చేసి పెట్టుబడి దారులను బెదిరించటం. ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత ఒప్పందాల పై సమీక్ష చేస్తాను అని చెప్పటంతో, యావత్తు కార్పోరేట్ ప్రపంచం షాక్ అయ్యింది. ఇప్పటికే కేంద్రం రెండు సార్లు లేఖలు రాసి జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించింది. నిన్న ట్రిబ్యునల్ కూడా, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, గ్రీన్ కో కంపెనీకి ఇచ్చిన నోటీస్ పై స్టే ఇచ్చింది.
ఇలా జగన్ మోహన్ రెడ్డికి ప్రతి స్టేజ్ లోనూ ఎదురు దెబ్బులు తగులుతున్నా, తాను మాత్రం మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలని చూస్తున్నారు. అయితే జగన్ విధానాల పై కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ స్పందించింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పేరుతొ ఇబ్బంది పెడితే, ఇది కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపి, పెట్టుబడి దారులు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని 'ఫిచ్' హెచ్చరించింది. సోలార్, విండ్ ఎనర్జీ ఒప్పందాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్షలు చేస్తే, ఆ సంస్థల నగదు ప్రవాహానికి ఇబ్బందులు కలుగుతాయని తెలిపింది. ఏపి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే, పునరుత్పాదక విద్యుత్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తుందని ఫిచ్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అనుకునట్టు, పీపీఎలను పునఃసమీక్షించినప్పటికీ, విద్యుత్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపింది. ఏపి చర్యల వల్ల ఆ కంపెనీలకు కొన్ని పరిమితులతో ఇచ్చే రుణ సదుపాయం తగ్గి, కంపెనీ బాండ్ విలువ పడిపోతుందని తెలిపింది. అందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటే, ఒక్క సంస్థ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టాదని, ఉన్న సంస్థలు వేల్లిపోతయాని హెచ్చరించింది. గతంలో కూడా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రయత్నించాయని, కాని కేంద్రం హెచ్చరించటంతో ఆగిపోయాయని గుర్తు చేసింది. ఏపి చేసింది కదా, అని మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే, ఇక్కడ ఈ రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించింది. మరి మన జగన్ గారు ఇప్పుడైనా వింటారో, లేకపోతే నేను ఇంతే అని ముందుకు వెళ్తారో చూద్దాం.