జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, జ్యుడిషియల్ కమిషన్ అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచంలో ఎవరూ చెయ్యని సాహసం చేస్తున్నా అని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుతో, ఈ రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికి రెండు నెలలు అవుతున్నా, కీలక ప్రాజెక్ట్ లు అన్నీ ఆగిపోయినా, ఆ జ్యుడిషియల్ కమిషన్ ఏమైందో తెలియదు. అయితే జగన్ ఏర్పాటు చేస్తానంటున్న జ్యుడిషియల్ కమిషన్ పై చంద్రబాబు స్పందించారు. ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై జరిగిన ప్రెస్ మీట్ లో జ్యుడిషియల్ కమిషన్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఒక విధంగా ఇది సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అంటూ గొప్పగా చెప్తుంటే, చంద్రబాబు మాత్రం ఒక్క మాటలు తీసి అవతల పడేసారు.
జ్యుడిషియల్ కమిషన్ అనేది పరిపాలనలో సాధ్యం అయ్యేది కాదని తేల్చి చెప్పారు. టెండర్ల విషయంలో ముందే జడ్జీలు జోక్యం చేసుకోరని, ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి గ్రహించాలని చంద్రబాబు అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ తో టెండర్లు పిలవటం అనేది సాధ్యం అయ్యే పని కాదని చంద్రబాబు అన్నారు. వైసిపీలో ఒక్కరికి కూడా సాంకేతిక అంశాల పై అవగాహన లేదని చంద్రబాబు అన్నారు. అన్ని విషయాలు వక్రీకరించి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఒప్పందాలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రం అని, అన్ని ఒప్పందాలు రెగ్యులేటరీ కమిషన్ ద్వరానే జరుగుతాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సాంకేతిక అంశాలు ప్రజలకు అర్ధం కావు కాబట్టి, మీమేదో అధిక రేట్లకు ఒప్పందాలు చేసుకుని, అవినీతి చేసామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
విద్యుత్ విషయంలో మేము 24 గంటలు కరెంట్ ఇచ్చి, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసామని, వీళ్ళు రెండు నెలల్లోనే అంతా అస్తవ్యస్తం చేసేసారని చంద్రబాబు అన్నారు. తెలంగాణా పై ఉన్న ప్రేమ, జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పై లేదని చంద్రబాబు అన్నారు. ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపించి, పబ్బం గడుపుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మరని, అధికారుల చేత ప్రెస్ మీట్ పెట్టించి, రాజకీయ ప్రసంగాలు చేపించి, వారి చేత అబద్ధాలు ఆడిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎందుకు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారో, ఆ అధికారులే చెప్పాలని చంద్రబాబు అన్నారు. అందరూ సౌర, పవన్ విద్యుత్ వైపు వెళ్తున్నారని, 2021 నాటికి 20 శాతం సాంప్రదాయేతర ఇంధనం చేరాలని గుర్తు చేసారు.