విద్యుత్ పై జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీల చేసిన ప్రసంగం ఆరోపణలు పై చంద్రబాబు స్పందించారు. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా, సభ వాయిదా వేసుకుని పారిపోయారని అన్నారు. సండుర్ పవర్ కంపెనీ, నీ కంపెనీ, నువ్వు కర్ణాటకలో ఎందుకు ఎక్కువ రేట్ కు కొంటున్నావ్, దానికి సమాధానం చెప్తే, ఇక్కడ నీకు సమాధానం దొరుకుంతుంది అని చెప్పమని, అయినా ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, ఏవేవో చెప్పి, సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత, మీడియాతో మాట్లాడారు. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. థర్మల్ విద్యుత్ అంటే ఏంటి, సోలార్ అంటే ఏంటి, వింగ్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ ఆయనకు తెలియదని, అధికారులు ఏది చెప్తే, అది చెప్తున్నారని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వితండవాదానికి ఏమి చెప్పాలో అర్ధం కావటం లేదని, తన వాదన కరెక్ట్ అని చెప్పటానికి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. థర్మల్ విద్యుత్ తక్కువ రేట్ కు దొరుకుతుంది, అదే సోలార్, విండ్ ఎనర్జీ మాత్రం ఎక్కువ రేట్ పెట్టాలి, తక్కువకు వస్తున్న థర్మల్ కాకుండా, ఎక్కువ ఖర్చు పెట్టి సోలార్, విండ్ కొన్నారు అంటే, ఇది ఒక పెద్ద స్కాం అంటూ జగన్ చెప్తుంటే, అతని అవగాహన ఎలా ఉందో అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నారని, ఐక్యరాజ్య సమితి కూడా ఒక పాలసీ తీసుకు వచ్చిందని, దానికి అనుగుణంగా కేంద్రం కూడా అటు వైపు వెళ్లిందని అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాను రాను తగ్గించుకుంటూ వస్తున్నామని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ వైపు వస్తున్నాయని అన్నారు. మనకు బొగ్గు నిలవలు కూడా లేవని అన్నారు. ఇవన్నీ ఆలోచించకుండా, తక్కువకు వస్తుంది కాబట్టి, అది మాత్రమే వాడాలి, సోలార్ విండ్ వాడకూడదు అని వితండవాదం చేస్తున్నారని, ఇలాగే ఆలోచిస్తే, రాష్ట్రం చీకటి పాలు అవుతుందని, ఇప్పటికే కరెంటు కోతలు వచ్చేసాయని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో జగన్ మోహన్ రెడ్డి సండుర్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పతి దారుడు. అక్కడ ఎందుకు ఎక్కువ ధరకు కొంటున్నావ్ అంటే, దాని గురించి చెప్పకుండా, పక్క రాష్ట్రంతో మనకు సంబంధం లేదు అని చెప్పి పారిపోయారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, చంద్రబాబుని సాధించటం కోసం అబద్ధాలు చెప్తే ఎలాగని అన్నారు. విద్యుత్ లో పులివెందుల పంచాయితీలో పెట్టాలని చూస్తే, కేంద్రం వాతలు పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు.