తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, శుక్రవారం సాయంత్రం, గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆయన చెప్పినట్టుగానే, 5 రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, రెండు రోజులు తెలంగాణా రాజకీయాల పై ఫోకస్ చేస్తున్నారు. గత నెల రోజులుగా, ప్రతి వారం రెండు రోజుల పాటు, తెలంగాణాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గుంటున్నారు. తెలంగాణాలో పార్టీని బల పరిచి, నాయకత్వాన్ని తాయారు చెయ్యటనికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. బలమైన నేతలు ఎవరూ లేకపోయినా, తెలంగాణాలో తెలుగుదేశం క్యాడర్ మాత్రం అలాగే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ సీట్లలో పోటీ చేసి కూడా, రెండు సీట్లు సాధించారు. ఇక నుంచి ఏ పార్టీతో పొత్తు లేకుండా, సొంతగా ఎదిగే ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసమని, చంద్రబాబు ప్రతి వారం, తెలంగాణాలో పర్యటన చేస్తున్నారు.

ఈ క్రమంలో, నిన్న కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి, చంద్రబాబుతో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వచ్చిన నాగంతో, తెలంగాణాలోని రాజకీయ పరిస్థితితుల పై చర్చించినట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో జరిగిన తెలంగాణా ఎన్నికల తరువాత, నాగం జనార్ధన్ రెడ్డి, ఆక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాగం, చంద్రబాబుతో భేటీ ఎందుకు అయ్యారా అనే ఆసక్తి నెలకొంది. నాగం జనార్ధన్ రెడ్డి, చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మంత్రిగా కూడా పని చేసారు. మరో పక్క తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌, కోడెల శివప్రసాదరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా చంద్రబాబుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read