జగన్ ఆప్తుడు, వైసిపీ నెంబర్ 2 లీడర్, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డి పై తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమిస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవిని, 13 రోజులు అనుభవిస్తూనే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, అందుకే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు, తెలుగుదేశం పార్టీ పిటీషన్ సమర్పించింది. రాజ్యాంగం లోని 102వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారు, ఎవరూ, కేంద్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో, లాభం వచ్చే పదవుల్లో ఉండ కూడదు అని, ఆ రూల్ ని అధిగమించి, 13 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, విజయసాయి రెడ్డి పై అనర్హత పిటీషన్ వెయ్యాలని, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, గళ్ళ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, సంతకం చేసి, రాష్ట్రపతికి పిటీషన్ సమర్పించారు.
ఈ పిటీషన్ సమర్పణ తరువాత, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మీడియా ముందుకు వచ్చారు. జూన్ 22 న విజయసాయి రెడ్డిని, ఢిల్లీలో ఏపి ప్రత్యెక ప్రతినిధిగా నియమించారని, అప్పటి నుండి విజయసాయిరెడ్డి కేబినెట్ మంత్రి హోదా అనుభవిస్తూ, ఆయనకు ఏపీ భవన్‌లో కారు, డ్రైవర్, కార్యాలయం కేటాయించారని చెప్పారు. భారత రాజ్యాంగంలోని 103వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యుడుని అనర్హుడిగా ప్రకటింటే అధికారం ప్రెసిడెంట్ అఫ్ ఇండియాకు ఉందని చెప్పారు. రూల్స్ ప్రకారం రాష్ట్రపతి తన నిర్ణయం ప్రకటించే ముందు, భారత ఎన్నికల కమిషన్ సూచనలు తీసుకుంటారని అన్నారు. 13 రోజులు పదవిలో ఉన్న తరువాత, అనర్హత వేటు పడుతుందని గ్రహించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినన్స్ తెచ్చి, ఈ పదవి లాభాపేక్ష పదవి కాదని చెప్పారని అన్నారు. అయినా సరే 102వ షడ్యుల్ ప్రకారం అనర్హత వేటుపడుతుందని రాష్ట్రపతికి వివరించినట్లు తెలుగుదేశం సభ్యులు చెప్పారు. మరి రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.