తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత, ఆ పార్టీ నేతలు కొంత మంది పార్టీని వీడి వెళ్తున్నారు. ఎక్కువ మంది బీజేపీ పార్టీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ధోరణితో, ప్రతి నాయకుడు పై, ప్రత్యర్ధి పార్టీలు, ఈ తరహా ప్రచారం మొదలు పెట్టాయి. ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీని వీడి మా పార్టీలోకి వస్తున్నాడు, ఈ నాయకుడు వస్తున్నాడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇదే కోవలో, మాజీ ముఖ్యమంత్రి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి పై ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన పార్టీ మార్పు పై వస్తున్న వార్తల మీద క్లారిటీ ఇచ్చారు. నేను ఏ పార్టీ మారటం లేదని, తెలుగుదేశం పార్టీని వీడి, నేను ఏ పార్టీలో చేరటం లేదని, కార్యకర్తలు అందరూ ఈ విషయం పై గందరగోళం చెందవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నా అంటూ, తన రాజకీయ జీవితం పై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, వాటి గురించి పట్టించుకోవద్దని అన్నారు. ఈ ప్రచారాలు, ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదని, వారి ట్రాప్ లో పడవద్దు అని క్లారిటీ ఇచ్చారు.

నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి నిన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఉన్న కష్ట కాలంలో చంద్రబాబుని వదిలేసి వెళ్ళిపోయేందుకు సిద్దంగా లేనని అన్నారు. ఎంతటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నా ప్రయాణం చంద్రబాబుతోనే ఉంటుందని, చంద్రబాబుని వెన్నంటి ఉంటానని అన్నారు. ఏ పార్టీ బలపడినా, ఏ పార్టీ బలపడకపోయినా, నైతిక నిబద్ధత అనేది ఉంటుందని, దాని ప్రకారం, నేను చంద్రబాబుతోనే నడుస్తానని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చినా, ఆయనకు కుప్పంలో స్వాగతం పలకటానికి వెళ్లలేదని, కానీ మొదటిసారి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికానని అన్నారు. ఇలాంటి టైంలో, మేము మీ వెంటే అని చెప్పటానికి, ఇలా చేసానని అన్నారు. ఓటమి కారణాలు సమీక్షించుకుని, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలని సమాయత్తం చేస్తానని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read