ఒక కట్టడటం కట్టాలి అంటే, ఎంతో కష్టపడాలి. అదే కూల్చాలి అంటే, రాత్రికి రాత్రి తోసి అవతల పడేయవచ్చు. చంద్రబాబు ఎంతో కష్టపడి, ప్రజల నుంచి వినతలు తీసుకోవటానికి, సమీక్షలు జరపటానికి, కట్టిన ప్రజా వేదికను, జగన్ ప్రభుత్వం రాగానే, రాత్రికి రాత్రి కూల్చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అవినీతి చేసారు, అక్రమ కట్టడం అంటూ కూల్చే పడేసారు. అయితే, ఈ నిర్ణయం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చక్కని బిల్డింగ్, వాడుకోవటం ఇష్టం లేకపోతే, ఏ హాస్పిటల్ గానో, ఇంకా దేనికో దానికి ఉపయోగించు కోవచ్చు కదా, ఇలా కూల్చేటం ఏంటి అని ప్రశ్నించారు. మీకు దమ్ము ఉంటే, కరకట్ట మీద ఉన్న ప్రైవేటు భవనాలు కూడా కూల్చాలి, అంటూ వాదనలు వినిపించాయి. దీంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత రాకుండా, కరకట్ట మీద ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. వారంలో సమాధానం చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటాం అని. అయితే అన్ని అనుమతులు, వైఎస్ఆర్ హయంలో ఇచ్చిన విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసినా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చెయ్యటం కోసం, నోటీసులు ఇచ్చారు.
అయితే ఈ నోటీసుల పై, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్ యజమానాలు అందరు కోర్ట్ కు వెళ్లారు. సీఆర్డీఏ మూడు వారల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకో కూడదు అని, సీఆర్డీఏ ని కూడా ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలని కోర్ట్ కోరింది. తాము అన్నీ పక్కాగా చేసామని, అయినా నోటీసులు ఇచ్చారని, చందన కేదారిష్ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై వాదనలు వినిపిస్తూ, ఈ భవనం 2006లో నిర్మించామని, నోటీసు ఇచ్చే అధికారం సీఆర్డీఏ క్యాపిటల్ సిటీ జోన్ కమిషనర్‌కు లేదని చెప్పారు. సీఆర్డీఏ చట్టం-2014 రాకముందే, ఇక్కడ నిర్మాణాలు చేసామని చెప్పారు. నోటీసును నిలుపుదల చెయ్యాలని కోరారు. ప్రభుత్వం కూడా దీని పై వాదిస్తూ, ఏదైనా ఉంటె అప్పీలేట్ అథార్టీ దగ్గరకు రావాలని, హైకోర్ట్ కు రాకూడదని వాదించారు. వాదనలు విన్న కోర్ట్, అఫిదివిట్ దాఖలు చెయ్యమని కోరుతూ, నోటీసుల పై మూడు వారల స్టే విధించింది.