జగన్ ప్రభుత్వానికి, జపాన్ దేశం షాక్ ఇచ్చింది. షాక్ మాత్రమే కాదు, ఘాటు లేఖ కూడా రాసింది. జగన్ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ, కొంచెం స్పీడ్ తగ్గించుకోండి అంటూ, ఘాటుగా చెప్పింది. పునరుత్పాదక ఇంధన రేట్ల విషయంలో, జగన్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్న సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు టార్గెట్ గా, గత ప్రభుత్వంలో కుదురుచుకున్న విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష జరిపి, కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తుంది. అయితే ఇదే విషయం పై, ఇప్పటికే కేంద్రం మూడు సార్లు అలా చెయ్యద్దు అంటూ ఉత్తరం రాసింది. అలాగే ట్రిబ్యునల్ కూడా చీవాట్లు పెట్టింది. చివరకు 42 కంపెనీలు, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హై కోర్ట్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా జగన్ మాత్రం తగ్గటం లేదు. ఎంత మంది చెప్పినా మొండిగా వెళ్తున్నారు.

japan 14082019 2

ఇప్పటికే అనేక మంది బిజినెస్ అనయలిస్ట్ లు, ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టటానికి ఎవరు రారని హెచ్చరిస్తున్నా, జగన్ మాత్రం ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో, ఇప్పుడు ఏకంగా జపాన్ ప్రభుత్వం, కేంద్రానికి కాకుండా, ఏకంగా జగన్ ప్రభుత్వానికే లేఖ రాయటం సంచలనం అనే చెప్పాలి. దేశాలు దాటి, వేరే దేశాలు చేత కూడా, మొట్టికాయలు వేయించుకుంటున్నారు. ఇండియాలో జపానీస్ ఎంబాసిడర్ కెంజి హిరమత్సు జగన్‌కు ఘాటు లేఖ రాసారు. మీ చర్యలు నిశితంగా పరిశీలిస్తున్నాం. గతంలో చేసిన ఒప్పందాలు మళ్ళీ సమీక్షించటం ఏంటి అంటూ, హెచ్చరించారు.. ఇలా అయితే, ఎవరూ పెట్టుబడులు పెట్టరు అంటూ హెచ్చరించారు. భారత దేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోకి ఫ్రాన్స్, సౌతాఫ్రికా, యూరోప్ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్న టైంలో, ఇవేమీ నిర్ణయాలు అంటూ జపాన్ ఆక్షేపించింది.

japan 14082019 3

జపాన్‌కు చెందిన కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టారు. వారిలో ముఖ్యంగా ఎస్.బి. ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ అనే సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎస్.బి. ఎనర్జీ సంస్థలో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, సాఫ్ట్ బ్యాంక్ భారీ పట్టుబడులు, ఈ రంగంలో పెట్టాయి. పెట్టుబడులు వాతావరణం ఇంత బాగా ఉంటే, ఇప్పుడు కనుక జగన్ ప్రభుత్వం, గత కాంట్రాక్టులను రద్దు చేసుకున్నా, పునఃసమీక్షించినా దాని ప్రభావం దేశ వ్యాప్తంగా, ఈ సంస్థలు పెట్టిన పెట్టుబడులు పై పడతాయి. అంతే కాదు, కొత్తగా వచ్చే కంపెనీలు కూడా, ఈ వైఖరితో పెట్టుబడులు పెట్టటానికి భయపడతాయి. ఇప్పటికైనా జగన్ గారు, చంద్రబాబు మీద కక్ష సాధింపు ఆపితే, రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా మంచి జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read