Sidebar

06
Tue, May

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యుత కంపెనీలు వదిలి పెట్టటం లేదు. జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా చేసిన పని, ఆయన మెడకే ఇప్పుడు చుట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఇది తప్పు అని చెప్పినా, కేంద్ర మంత్రి ఇలా చెయ్యకూడదు, కావాలంటే ఈ డాక్యుమెంట్ లు చూడండి అని చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం వినలేదు. ఈ విషయంలో మొదటి ఎదురు దెబ్బ గ్రీన్ కో కంపెనీ ట్రిబ్యునల్ వద్దకు వెళ్ళటంతో, జగన్ ప్రభుత్వానికి మొదటి షాక్ తగిలింది. తరువాత కేంద్ర సంస్థలు ఎన్టీపీసీ, సోలార్ కార్పొరేషన్ అఫ్ ఇండియా షాక్ ఇచ్చాయి. రెండు రోజుల క్రితం హైకోర్ట్ కూడా జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దాదపుగా 40 విద్యుత్ ఉత్పత్తి కంపనీలు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్ట్ కు వెళ్ళటంతో, కోర్ట్ ఆ జీఓ పై నాలుగు వారల స్టే ఇచ్చింది.

ioc 27072019 2

ఈ నేపధ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కూడా షాక్ ఇచ్చింది. పవన్ విద్యుత్తు ధరను తగ్గించాలీ అంటూ ప్రభుత్వం రాసిన లేఖ బదులు ఇస్తూ, ఒక్క రూపాయి కూడా ధరలు తగ్గించటం సాధ్యం కాదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇది ఒక్కటే కాదు, తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.23.35 కోట్ల బకాయిలు పడిందని, ఆ డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని ఎస్పీడీసీఎల్‌కు ఐఓసి లేఖ రాసింది. గతంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ప్రకారం, యూనిట్‌ ధర రూ.4.70 వంతున చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం కోరినట్టు యూనిట్‌కు రూ.2.43 చెల్లించటం కుదరదని, ఒప్పందం ప్రకారం మొత్తం చెల్లించాల్సిందే అంటూ తేల్చి చెప్పింది.

ioc 27072019 3

ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరుపున ఆపరేషన్స్ జీఎం, ఎస్‌డీ పాండే రాసిన లేఖ. "ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ధరలు ప్రకారమే అప్పట్లో ఒప్పందాలు చేసుకున్నాం. దాని ప్రకారం యూనిట్‌కు రూ.4.70 వంతున పొందే హక్కు మా కంపెనీకి ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం మారింది కాబట్టి, యూనిట్‌ ధరను తగ్గించాలని మీ కోరటం, చట్ట విరుద్ధం. పవన విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేసిన సమయంలోని ధరకు, ఇప్పటి ధరకు, మీరు పోల్చి చూడటం కరెక్ట్ కాదు. ఈ ప్లాంట్ పై ఇప్పటికే మేము భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టాం. రోజు రోజుకీ మాకు నిర్వహణ భారం పెరుగుతుంది. ఒప్పందాల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఏపీఈఆర్‌సీ అనుమతితోనే, ఇరు పార్టీలు ఒప్పుకుంటేనే జరగాలి. మీరు మమ్మల్ని రేటు తగ్గించమని, లేకోపోతే ఒప్పందాలు రద్దు చేస్తాం అంటున్నారు. అలా చెయ్యటం చట్ట విరుద్ధం" అని లేఖలో రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read