సినీ హీరో, అలాగే రాజకీయాల గురించి ఆక్టివ్ గా మాట్లాడే శివాజీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో శివాజీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాని పై ఈ రోజు శివాజీ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది వరకు తనకు సెక్యూరిటీ ఉండేదని, తెలంగాణాలో కూడా సెక్యూరిటీ ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం మారగానే రెండు చోట్లా తీశేసారని అన్నారు. ఈ సందర్భంగా, తనకు కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని, తనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా జగన్ ప్రభుత్వాన్ని కోరానని, అయినా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని అన్నారు. జగన్ మీద తాను వ్యతిరేకంగా మాట్లాడానని, ఇలా ఇబ్బంది పెడుతున్నారేమో, కాని నేను జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై, మాట్లాడుతూనే ఉంటానని అన్నారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీన్ మారిపోయిందని అన్నారు. అందరూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని శివాజీ అన్నారు. ఈ పరిస్థితి వెంటనే చక్కదిద్దుకోవాలని శివాజీ అన్నారు. అలాగే గోదావరి నీతి తరలింపు విషయంలో కేసిఆర్ ను నమ్మవద్దు అంటూ జగన్ ను హెచ్చరించారు. తానను కనుకు ఎవరైనా చంపేస్తే, దానికి మేఘా కృష్ణా రెడ్డి కారణం అని, శివాజీ అన్నారు. నిన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఆయనను అడ్డగించటం పై కూడా స్పందించారు. మా అబ్బాయ్ అడ్మిషన్ కోసమని అమెరికా వెళ్ళటానికి కోర్ట్ లో పర్మిషన్ తీసుకున్నాను అని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎవరూ తనను అడ్డుకోలేదని, నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కగానే, ఇక్కడ ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ అథారిటీకి మెయిల్ చేసారని, వారు నన్ను అక్కడ అడ్డుకున్నారని అన్నారు.
వారు అప్పుడు నన్ను అడిగారని, ఇక్కడ ఉండి ఎంబసీతో మాట్లాడుకుంటారా అని అడిగితే, వీకెండ్ కదా, ఏ పని అవ్వదు, నేను నా దేశం వెళ్ళిపోతా, అక్కడ చూసుకుంటా అని చెప్పానని అన్నారు. జరిగింది ఇది అయితే, నేను మారు వేషంలో పారిపోయాను అంటూ, ఇక్కడ కొన్ని ఛానెల్స్ కావాలని ప్రచారం చేశాయని అన్నారు. ఇక్కడ హైదరాబాద్ పోలీసులకు నన్ను పట్టుకోవటం చేత కాలేదు, దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు అని ఆ ఛానల్ చెప్పాలనుకుంటుందా అని ప్రశ్నించారు. మై హోం రామేశ్వరరావును, మెగా కృష్ణారెడ్డిని లేదంటే, వారికి సంబంధించిన పార్టీలను ఏదో విధంగా సంతోష పెట్టాలని అనుకుంటున్నారా? అని ఆ టీవీ ఛానల్ పై మండిపడ్డారు. ఇప్పటివరకూ అమెరికాకు యాభై సార్లు వెళ్లానని, ఈ సారి కూడా కేసు పెట్టారు కాబట్టి, కోర్ట్ ద్వారానే పర్మిషన్ తీసుకుని వెళ్లానని, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు.