ఒక మంత్రి నన్ను హింస పెడుతున్నాడు అంటూ, ఒక మహిళ ఉత్తరం రాసి, సూసైడ్ చేసుకుని, హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుకుంటుంటే, అలాంటి మంత్రుల అరాచకాలు, ఈ ముఖ్యమంత్రికి కనిపించటం లేదా అంటూ, జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మంత్రి పెర్ని నాని తనను ఇబ్బంది పెడుతున్నారని, ఒక మంత్రి ఆత్మత్యాయత్నం చేసిన ఘటన పై చంద్రబాబు స్పందించారు. ఒక మంత్రి ఇలా అరాచకాలు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేస్తుంది, హోం మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు.
ప్రతి రోజు ఎక్కడో ఒక చోటు, తెలుగుదేశం కార్యకర్తలని టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ రెండు నెలల్లో, జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు అనే అండ చూసుకుని, తమ పార్టీ నేతలపై 285 దాడులు, 7 హత్యలు జరిగాయని చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా సాక్షాత్తు మా ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసారని అన్నారు. ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బాల వీరాంజనేయస్వామిపైనా వైసిపీ నేతలు దాడి చేసారని అన్నారు. స్పీకర్ కు, సభ్యులు హక్కలు పై దాడులు చేస్తుంటే, కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతల పై జరుగుతున్న దాడులు విషయంలో పోలీసులు కూడా అసలు పట్టించుకోవటం లేదని అన్నారు. రెండు రోజుల్లోగా తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసిన వారిని పట్టుకుని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వైసిపీ చెప్పినట్టు కాదని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లలో ఒక మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డు పై హింసించారని, మహిళా హోం మంత్రికి ఇవన్నీ పట్టవా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాడిపత్రిలో మా కార్యకర్తను చంపి, తిరిగి అతని కుటుంబ సభ్యులు మీదే మళ్ళీ కేసు పెట్టారని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఈ దాడులు ఆపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.