Sidebar

12
Mon, May

పగ కూడా వారసత్వంగా వస్తుందని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, లైవ్ గా చూస్తున్నాం. ఆ రెండు పత్రికలూ అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ల పై, తీవ్రమైన ఆంక్షలు పెట్టే వారు. కారణం, తన ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారని. ఆ కసితోనే, కొడుకు చేత సాక్షి అనే పేపర్, టీవీ పెట్టించారు. సియంగా ఉండగా, తన కొడుకు చేత, పేపర్, టీవీ పెట్టించిన ఘన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. అప్పటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేర్లు అంటేనే ఇంత ఎత్తున ఎగిరి పడేవారు. అదే వారసత్వంగా, తండ్రి చూపిన మార్గంలోనే జగన్ నడుస్తున్నారు. తాను ప్రతిపక్షంలో ఉండగా, తన గురించి ఒక్క వార్తా కూడా కవర్ చెయ్యకూడదు అని, అసలు మా ఆఫీస్ లోకే రాకూడదు అని ఆంధ్రజాతిని బ్యాన్ చేసారు జగన్.

assembly 27072019 2

అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి ఆయన ఇష్టం. కాని ఇప్పుడు అధికారం వచ్చింది. సియం అయ్యారు. ప్రభుత్వం అనేది ఆయాన సొత్తు కాదు. ప్రజలది. ప్రజలకు ప్రభుత్వం గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది. అలాగే పత్రికలకు కూడా. కాని వారిని కూడా ఎలా అయినా ఇబ్బందులు పెట్టాలని డిసైడ్ అయ్యి, ముందుగా ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఇబ్బందులు మొదలు పెట్టారు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా ఆపేసినా, ఈనాడుకు మాత్రం నిబంధనల ప్రకారం కొద్దిగా ఇస్తున్నారు. సాక్షికి మాత్రం ఫుల్ ఫ్లో లో ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో, నిబంధనలు అతిక్రమించాని, ఏకంగా మూడు ఛానెల్స్ అయిన, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లకు అసెంబ్లీలోకి అనుమతి లేకుండా షాక్ ఇచ్చారు.

assembly 27072019 3

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో, బయట జరుగుతున్న ప్రెస్ మీట్ ఇచ్చారని అభియోగం. అయితే, దీని పై సదరు ఛానెల్స్ స్పీకర్ కు వివరణ ఇచ్చాయి. అచ్చెంనాయుడుని సస్పెండ్ చేసిన టైంలో, ఆయన బయటకు వచ్చి మాట్లడటంతో లైవ్ ఇచ్చాం అని, కాని కేవలం ఒక నిమిషం 30 సెకండ్లు మాత్రమే ఇచ్చామని, అప్పటికే అది తప్పు అని తెలుసుకుని ఆపేసామని, మరోసారి ఇలా జారగాకుండా చూసుకుంటాం అని చెప్పారు. అయితే వివరణ లేఖలు ఇచ్చిన తరువాత కూడా అసెంబ్లీ లోపలకు అనుమతించలేదు. శుక్రవారం మరిన్ని ఆంక్షలు పెట్టారు. ఈ మూడు చానల్స్ ని అసెంబ్లీ లోపలకి అనుమతించకపోయినా, ఐ & పీఆర్ ఇస్తున్న లైవ్ ఫీడ్ తీసుకుని, ఒక ఛానెల్ లైవ్ ఇస్తే, అది కూడా కుదదరు అంటూ, ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒక చిన్న నిబంధన పట్టుకుని, ఏకంగా మూడు ఛానెల్స్ పై ఆంక్షలు విధించారు. ఇవే నిబంధనలు జగన్ గారి సాక్షి పై అప్పట్లో చంద్రబాబు అమలు చేసి ఉంటె, ఈ పాటికి సాక్షి ఛానెల్ ఎక్కడ ఉండేదో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read