మొన్నటి దాక ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అంటూ జబ్బలు చరుచుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. ప్రస్తుతం అంతా రివర్స్ లో నడుస్తుంది. నాడు ఏపి నెంబర్ వన్ డెస్టినేషన్ అనుకున్న కార్పొరేట్ దిగ్గజాలు, నేడు బాబోయ్ అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలు అన్నీ ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అమరావతి, పోలవరం ఆగిపోయాయి. మరో పక్క బందర్ పోర్ట్ విషయంలో కూడా క్లారిటీ లేక పోవటంతో, నవయుగ కంపెనీ తన మిషనరీ మొత్తం వేరే సైట్ కు తరలించింది. ఇక విద్యుత్ రంగంలోని కంపెనీలు అయితే వణికి పోతున్నాయి. 40 కంపెనీలు కలిసి కోర్ట్ కు కూడా వెళ్ళటంతో, కోర్ట్ ఏపి ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పై దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్&టీ సంస్థ ఎండీ, సీఈవో అయిన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ స్పందించారు. రాష్ట్రంలో మా పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడు, ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు. ఒక ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు ఇస్తుంది. మరో ప్రభుత్వం వచ్చి ఆ పనులు కుదరదు ఆపేయమంటుంది. ఇదేక్కడ పధ్ధతి ? ఇలా అయితే ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇక చూసే పరిస్థితి లేదు అని చెప్పారు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లు నడుస్తున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మికంగా తీసుకున్న అమరావతి ప్రాజెక్ట్ సహా, వంతెనలు, రహదారులు, సోలార్ ప్రాజెక్టులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదపుగా 9 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నయాని చెప్పారు. దేశ వ్యాప్తంగా 3 లక్షల కోట్లు పనులు చేస్తుంటే, అందులే 3 శాతం ఏపిలో ఉన్నాయని అన్నారు. ఎక్కడా లేని పరిస్థితి, మాకు ఇక్కడ ఎదురవుతుందని అన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, 25 శాతం ప్రాజెక్ట్ పనులు అవ్వక పొతే, పనులు ఆపేయమని కోరటం విడ్డురంగా ఉందని అన్నారు. ఇవేమీ మాకు ఊరికే ఇవ్వలేదని, అంతా ట్రాన్స్పరెంట్ గా టెండర్ విధానంలో జరిగిందని అన్నారు. ఒక ప్రభుత్వం టెండర్ ఇవ్వటం, ఇంకో ప్రభుత్వం వచ్చి రద్దు చేసుకుంటూ పొతే, ప్రగతి ఆగిపోతుందని అన్నారు. తాజా పరిణామంతో, శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో ఎల్ అండ్ టీ షేర్లు ధర 1 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్స్ కు కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది.