ఉత్తర కొరియా కార్ల కంపెనీ దిగ్గజం కియా కంపెనీ, ఎంత పెద్ద కంపనీ అనేది అందరికీ తెలిసిందే. అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అంతర్జాతీయ స్థాయిలో, గుర్తింపు ఉన్న కంపెనీ. అలాంటి కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టటానికి సిద్ధమైంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి దిగ్గజ రాష్ట్రాలు తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి పోటీ పడ్డాయి. చంద్రబాబు ఏమి మాయ చేసారో కాని, అంత పోటీని తట్టుకుని మరీ, ఆ కంపెనీని మన రాష్ట్రానికి తీసుకు రావటంలో సక్సెస్ అయ్యారు. ఈ కంపెనీ ఏకంగా 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. నిన్న కియా ఉత్పత్తి చేసిన మొదటి కారు మార్కెట్ లోకి వదిలారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని పిలిచినా ఆయన వెళ్ళలేదు.
పార్టీ ప్రతినిధులుని పంపించారు. అయితే ఈ సందర్భంలో, వైసిపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తనకు, అక్కడ ఉన్న కియా ప్రతినిధులు అవాక్కయ్యారు. ఒక విధంగా చెప్పాలి అంటే బెదిరిపోయారు. ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీనే వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు అంటే, ఇక లోకల్ పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. నిన్న గోరంట్ల మాధవ్ స్టేజ్ పైనే కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చెయ్యటం కనిపించింది. అలాగే కియా మొదటి కార్ పై సంతకం చెయ్యండి అని ప్రతినిధులు కోరగా, ‘కియ కార్ రోల్ అవుట్.. బట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఈజ్ రూల్డ్ అవుట్’ అని రాసారు. అంతే కాదు, మీరు ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉన్నారు అంటూ, కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
కియా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి గారి పేరు లేదని, ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 75 శాతం ఉద్యోగాలు ఇక్కడ వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం రూల్ పెట్టిన విషయం తెలియదా అని కియా పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కియా మీద జగన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఇక్కడ కియా అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. వారు ఒప్పందం కుదుర్చుకునే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు జగన్ వచ్చి నేను కొత్త రూల్ పెట్టాను అంటే, 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు వీళ్ళ మాట వింటాడా ? ఈయన జగన్ కి కంప్లైంట్ చేస్తాను అంటున్నారు, కియా వాళ్ళకు వీళ్ళ చెష్టలకు మండి, మోడీకి కంప్లైంట్ ఇస్తే, జగన్ పరిస్థితి ఏంటి ? వీళ్ళ పులివెందుల పంచాయతీకి, కియా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే, పరిస్థితి ఏంటి ? వీళ్ళ ఇగో కోసం, రాష్ట్రం బలి అవ్వాలా ?