జగన్ మోహన్ రెడ్డి ఒక పావు కదిపితే, కేంద్రం ఒకేసారి రెండు పావులు కదుపుతుంది. అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా మరి. ఊరికే వదులుతారా ? పిండేస్తారు. మనం ఎంత నటించినా, మన లోపల ఉన్నది ఏమిటో, ఇట్టే పసిగట్టే గుణం ఉన్న మోడీ, అమిత్ షా లు, చూస్తూ కూర్చుంటారా ? ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న చంద్రబాబు లాంటి వాడినే, వాళ్ళతో పెట్టుకున్నందుకు, అధికారాన్ని వాడుకుని డమ్మీ చేసి పడేసారు. అలాంటిది 31 కేసులు ఉన్న జగన్ ఒక లెక్కా ? మనం ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప, ఏమి చెయ్యలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అందరినీ కలుస్తూ, రాష్ట్రానికి అన్ని విధాల సాయం చెయ్యమని కేంద్రాన్ని అడుగుతున్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసి కష్టాలు అన్నీ చెప్పారు.

polavaram 07082019 1

అలాగే జగన్ చేస్తున్న స్వీయ తప్పులు గురించి కూడా ప్రధాని మోడీకి వివరించారు. విద్యుత్ ఒప్పందాల పై సమీక్షకు వెళ్ళద్దు అంటూ కేంద్రం హెచ్చరిస్తున్నా, జగన్ వెళ్తున్నారు. అందుకు సంబధించి సంజాయషీ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేసారు అంటూ ఏవో లెక్కలు చెప్పారు. మరో పక్క కేంద్రం ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కూడా, వేలు పెట్టి, నవయుగను వెళ్ళగొట్టి, కొత్త టెండర్లుకు వెళ్ళాలని నిర్ణయించటం పై కూడా కేంద్రం గుర్రుగా ఉంది. దీని పై కూడా జగన్, ప్రధానికి సంజాయిషీ ఇచ్చారు. అయితే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి డబల్ గేమ్ ఆడుతున్నారని కేంద్రానికి అర్ధమైందో ఏమో కాని, వాళ్ళు కూడా రాష్ట్రం పై ఎదురు దాడి మొదలు పెట్టారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే షాక్ ఇచ్చారు.

polavaram 07082019 1

నిన్న పోలవరం పై ఆదుకోండి అని జగన్ మోహన్ రెడ్డి అడగ్గా, కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా, మీ పోలారం ప్రాజెక్ట్ ఎందుకు ఆపకూడదు అంటూ షోకాజ్ నోటీసు పంపించి, జగన్ ప్రభుత్వానికే కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. పోలవారానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చెయ్యకూడదో చెప్పండి అంటూ రాష్ట్రానికి నోటీసు పంపించింది. పోలవరం దాని అనుబంధ ప్రాజెక్ట్ ల పై, కేంద్రం పర్యావరణ శాఖ చేత తనిఖీలు చేపించింది. ఆ తనిఖీల్లో, 2005లో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని తేలినట్టు నివేదిక రావటంతో, కేంద్రం ఈ నోటీసులు ఇచ్చింది. అంటే రాజశేఖర్ రెడ్డి హయంలో. అయితే గతంలో చంద్రబాబు హయంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్న, స్టాప్ ఆర్డర్ పై కేంద్ర ప్రభుత్వం స్టే ఇస్తూ వచ్చేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఇలాగే రెండేళ్లకు స్టే ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు ఇవ్వటంతో, ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కేంద్రం దయ లేకపోతె, ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే అవకాసం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక సరైన సంజయషీ ఇవ్వకపోతే, పోలవరం గురించి, ఇక మర్చిపోవటమేనేమో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read