జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ లో, ప్రజలు మన వద్దకు వస్తే, చిరు నవ్వుతో పలకరించాలి, వాళ్ళ సమస్యలను నవ్వుతూనే పరిష్కరించాలి అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, వాస్తవంలో మాత్రం, అందుకు భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల, ఆందోళన చేస్తున్న వారి పై, ఈ మధ్య కాలంలో, తీవ్రంగా స్పందిస్తున్నారు. మొన్నటి మొన్న తమ ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని ఆందోళన చేసిన కాంట్రాక్టు ఉద్యోగులుని, ఆడవాళ్ళు అని కూడా చూడకుండా, లాగి అవతల పడేసి అరెస్ట్ చెయ్యటం చూసాం. ప్రతి రోజు ఎదో ఒక ఆందోళన జరుగుతూ ఉండటం, వారి పై పోలీసుల దురుసు ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పే దానికి, గ్రౌండ్ లో జరుగుతున్న వాటికి ఇంత తేడా ఉంది.

nandigama 01082019 2

అయితే ఈ రోజు రైతుల పై పోలీసులు ప్రవర్తించిన తీరు, విమర్శలకు దారి తీస్తుంది. వారి ఆందోళన అర్ధం చేసుకోవాలి, లేకపోతే చర్చల ద్వారా పరిష్కారం చెయ్యాలి, ఇలా బట్టలు ఊదిపోయేలా ఈడ్చుకురావటం పై విమర్శలు వస్తున్నాయి. రైతన్నల ప్రభుత్వం అని చెప్పుకునే వైసిపీ పార్టీ, దీని పై సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన తీరుతో అందరూ షాక్ అయ్యారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను, పోలీసులు ఈడ్చుకు వెళ్ళి, జీప్ లో పడేసారు. తరువాత వారిని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

nandigama 01082019 3

పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం, అక్కడ రైతులతో ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు, రైతులకు ఇస్తాను అన్న పరిహారం మాత్రం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే రైతుల పొలాల్లో, ఈ రోజు విద్యుత్ అధికారులు వచ్చి, పనులు చేపట్టారు. మాకు రావాల్సిన పరిహారం ఇంకా రాలేదని, అది ఇవ్వకుండా ఎలా పనులు చేస్తారు అంటూ, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. రైతుల మాటలు పట్టించుకోకుండా, గత వారం రోజులుగా విద్యుత అధికారులు వచ్చి పనులు చేస్తున్నారు. దీంతో గురువారం రైతులు తీవ్ర ఆందోళన చేసారు. పరిహారం ఇస్తేనే పనులు చెయ్యనిస్తాం అని ఆందోళన బాట పట్టారు. దీంతో అక్కడ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, పోలీసులు వచ్చి, రైతులను ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి జీప్ ఎక్కించారు. ఈ తరుణంలో రైతుల ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఈ చర్య పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంపీ కేశినేని కూడా ఈ చర్యను ఖండించారు. చర్చల ద్వారా అయ్యే సమస్యను, రైతన్నల అరెస్ట్ దాకా తీసుకువెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read