ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు పడటం, ఆనవాయతీగా వస్తుంది. విభజన జరిగి, మొదటి సారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా, ఎప్పుడూ జీతాలు ఆపలేదు. చంద్రబాబు ఎక్కడ నుంచి డబ్బు తెస్తున్నారో కాని, మాకు మాత్రం టైంకి జీతాలు ఇచ్చేస్తున్నారు, ఆయన తిప్పలు ఆయన పడి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టలేదు అని ఉద్యోగస్తులు అనే వారు. తరువాత వీరికి ఐఆర్ కూడా పెంచారు చంద్రబాబు. అయినా ఎందుకో మరి, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబుని దూరం పెట్టారు. రాష్ట్రం గాడిలో పడిపోయింది, ఇక చంద్రబాబు లాంటి సమర్ధుడితో పని లేదు అనుకున్నారో, లేక చంద్రబాబు ఎక్కువ జీతం ఇచ్చి, కరెక్ట్ గా పని చేయ్యమనటం పాపమో కాని, ఉద్యోగులు మాత్రం మొన్న ఎన్నికల్లో చంద్రబాబుని దూరం పెట్టారు అనేది వాస్తవం.
అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన మొదటి సారి సచివాలయంలో అడుగు పెట్టిన రోజు, పార్టీ కార్యకర్తలు లాగా, జై జగన్ జై జగన్ అంటూ, ఉద్యోగులు నినాదాలు చేసారు. అయితే ఏ ప్రభుత్వాధినేత అయినా, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. 27 శాతం ఐఆర్ పెంచుతున్నాం అని చెప్పి, చంద్రబాబు పెంచిన 20 శాతం ఐఆర్ మాత్రం మూడు నెలలు ఇవ్వమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులకు మోదటి షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఇక తాజాగా ఇచ్చిన షాక్ అయితే, మామూలుగా లేదు. ప్రతి నేలా ఒకటో తారీఖు జీతాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం మాత్రం జీతాలు అందలేదు. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ముందుగా కొద్దిమందికి, పొరపాటున జీతాలు రాలేదేమోనని అనుకున్నారురు.
అయితే సమయం గడుస్తున్న కొద్దీ, సాయంత్రం అయినా, రాత్రి అయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులెవరికి జీతాలు అందలేదనే విషయం తెలుసుకుని ఉద్యోగులు అవాక్కయ్యారు. అయితే ఈ విషయం పై అరా తియ్యగా ఉన్నతాధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ఆర్థికస్థితి బాగోలేదని, అందుకే జీతాలు ఆలస్యం అయ్యింది ఏమో అనుకున్నారు. చివరకు రాత్రి మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వార్తలు రావటంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి పొరపాటు లేదని, ఖజానాలో డబ్బులు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరలో సాంకేతిక సమస్యలతో, జీతాలు ఇవ్వటం కుదరలేదని, ఈ రోజు, లేదా రేపు జీతాలు పడతాయని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరలో సాంకేతిక సమస్య వస్తే, దేశం అంతటా, ఇదే ఇబ్బంది ఉండాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సమస్య త్వరగా తీరిపోయి, మన ఉద్యోగులకు జీతాలు తొందరగా వస్తాయని ఆశిద్దాం.