ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో పాటు జెరుసలేం పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం ప్రత్యెక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లారు జగన్. అయితే ముందుగా ఎక్కడా లీక్లు ఇవ్వకుండా, ఈ రోజు హైదరాబాద్ వెళ్ళటంతోనే, అటు తెలంగాణా గవర్నర్ నరసింహన్ ను, మరో పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ భేటీ కావటం ఆసక్తి రేపుతుంది. ముందుగా జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ దాడుపుగా గంటకు పైగా సాగింది. ఇది ఇలా ఉంటే, కొత్త గవర్నర్ రాక ముందు, నరసింహన్ షడ్యుల్ లో లేకపోయినా, కేవలం జగన్ ను కలవటం కోసం, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. అయితే ఈ భేటీల పై వైసీపీ స్పష్టత ఇచ్చింది.
కేవలం ఏపి, తెలంగాణా సమస్యల పరిష్కారం కోసమే, కలిసారు అంటూ చెప్తున్నారు. అయితే గవర్నర్ తో గంట సేపు భేటీ అయిపోగానే, జగన్ మోహన్ రెడ్డి, మళ్ళీ కేసిఆర్ వద్దకు వెళ్లారు. ప్రగతి భవన్ కు చేరుకొని, కేసీఆర్ తో చర్చలు జరిపారు. అయితే ఈ భేటీలో విభజన అంశాలతో పాటు, గోదావరి పై కట్టే ప్రాజెక్ట్ విషయం పై చర్చించినట్టు, వైసిపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 8 న కేంద్రం, ఇరు రాష్ట్రాలతో కలిపి, విభజన అంశం పై మీటింగ్ పెట్టిందని, ఆ విషయాలు అన్నీ చర్చించటానికి జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజ కేసిఆర్ ని, గవర్నర్ ను కలిసారని, వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అంతకు మించి, దీంట్లో మరే ఉద్దేశం లేదని, రాజకీయ చర్చలు అసలు లేవని చెప్తున్నారు. అయితే, సహజంగా, ఇద్దరూ సియంలు కలుస్తున్నారు అంటే, ముందే సమాచారం ఉంటుంది.
ముందుగానే మీడియా ఊదరగొడుతుంది. అయితే ఈ రోజు మాత్రం, జగన్ మోహన్ రెడ్డి సడన్ గా వెళ్లి కలిసారు. దీంట్లో రాజకీయ కోణం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, కేసిఆర్ ను టార్గెట్ చెయ్యటం, అటు ఆంధ్రాలో కూడా జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టటం, మరో పక్క విద్యుత్ పై లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వమని రాష్ట్రాలని అడుగుతూ ఇబ్బంది పెట్టటం, రాష్ట్రాల హక్కులన్నీ నెమ్మదిగా ఢిల్లీలోనే ఉంచుకోవాటం, ఇలా వీటి పై చర్చించారని, బీజేపీ దూకుడికి ఎలా కళ్ళెం వెయ్యాలి, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా ఎలా చెయ్యాలి అనే రాజకీయ చర్చలు కూడా ప్రముఖంగా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం జగన్, తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులు జెరూసలేం పర్యటనకు వెళ్తున్న సమయంలో, ఈ ప్రయాణానికి ముందే తెలంగాణ గవర్నర్, సీఎంతో జగన్ భేటీ కావడంతో రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.