జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాజకీయ ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీ కార్యర్తలు, నాయకులు, దాని అధినేత చంద్రబాబునే కాదు, ప్రతిపక్షంలో ఉండగా, విధులు నిర్వహిస్తూ, తనను అడ్డుకున్న వారి పై కూడా, ఇప్పుడు అధికారం రాగానే కక్ష తీర్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు చెప్తునట్టు, ఇది నిజంగా పులివెందుల పంచాయతీ లాగానే ఉంది. దాదపుగా మూడేళ్ళ క్రితం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన సీన్ గుర్తుందా ? మర్చిపోయే సీన్ కాదు అది. అప్పట్లో రాష్ట్రం మొత్తం జగన్ మోహన్ రెడ్డి , ఆయన అనుచరులు, ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి చేసిన హంగామా ఇంకా ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అయితే అప్పట్లోనే జగన మోహన్ రెడ్డి, తనను అడ్డుకున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి కూడా అలాగే వార్నింగ్ ఇచ్చారు.

vizag 01082019 2

ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ వార్నింగ్ నిజం చేస్తున్నారు. ఇప్పుడంటే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు కాని, అప్పట్లో అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రత్యెక హోదా కోసం, ఎన్నో ఉద్యమాలు చేసే వారని వైసిపీ అంటూ ఉంటుంది. ఆ టైంలో వైజాగ్ వేదికగా పెద్ద ఉద్యోమానికి ప్లాన్ చేసారు. అయితే ఆ రోజు రిపబ్లిక్ డే, తరువాత రోజు నుంచి వైజాగ్ లో ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతుంది, మళ్ళీ ఎక్కడ రత్నాచల్ తగలబెట్టినట్టు తగలబెడతారో, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఇన్వెస్టర్స్ ముందు పరువు పోతుందని, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. అయితే, ఆయన్ను ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు అనే డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది.

vizag 01082019 3

ఆ సమయంలో పోలీసులకు, జగన్ కు మధ్య గొడవ జరిగింది. ఆయన్ను తిరిగి హైదరాబాద్ పంపించే క్రమంలో, రన్-వే పై కూడా ధర్నా చేసారు. అయినా పోలీసులు జగన్ ను హైదరాబాద్ పంపించేసారు. అయితే, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. అప్పట్లో తనను అవమానించిన పోలీసుల లిస్టు తెప్పించారు. తనను అడ్డుకున్న పోలీసుల అధికారులు అందరినీ వీఆర్‌కు సరెండర్‌ చేయాలని, పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆదేశాలు రావటంతో, వైజాగ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అలాగే ఇంకా కొంత మంది ఉన్నారని, వారిని కూడా వీఆర్‌కు పంపినట్లు సమాచారం. మొత్తానికి విధి నిర్వహణ చేసినందుకు, ఇప్పుడు పోలీసులు బలయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read