Sidebar

07
Wed, May

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, వైసీపీ నేతలు వెంటాడుతున్నారు. ఒకసారి కొత్త వ్యూహంతో రోజుకి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే పై కోర్ట్ ల్లో కేసులు వేస్తూ, ఏవో సాకులు చూపించి, వారి ఎన్నిక చెల్లదు అంటూ, కేసులు పెడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అయితే వారిలో కొంత మందిని లాగేసి, తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకండా చూడాలని ప్లాన్ చేసారు. అయితే, జగన్ మాత్రం, నేను అలా తీసుకోను అంటూ నీతులు చెప్పి, వేరే మార్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల పై ఒక వ్యూహం ప్రకారం టార్గెట్ చేసి, వారిలో కొంత మందిని అనర్హులుగా ప్రకటించే గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. గత వారం రోజులుగా రోజుకి ఒక ఎమ్మెల్యే పై, ఇలా అఫిడవిట్ లో సాంకేతిక అంశాలు చూపించి కోర్ట్ లో అనర్హత పిటీషన్ వేస్తున్నారు. ఇప్పటికే, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామ కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్‌రావు, అచ్చెంనాయడు , అనగాని సత్య ప్రసాద్ పై, ఈ విధంగా కోర్ట్ కు వెళ్లారు.

ఇప్పుడు తాజగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కోర్ట్ కు వెళ్లారు. వంశీ పై ఓడిపోయినా గన్నవరం వైసీపీ అభ్యర్ధి, యార్లగడ్డ వెంకటరావు, వంశీ ఎన్నిక చెల్లదు అంటూ కోర్ట్ మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం పిటీషన్ ధాఖలు చేసారు. ఎన్నికల ప్రచారం సమయంలో, ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను వంశీ ఉల్లంఘించారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసారని, ఆ పిటీషన్ లో చెప్పారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయం పై కూడా అనుమానాలు ఉన్నాయని, అవి మరోసారి లేక్కించాలని, వెంకటరావు కోరారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం., అలాగే ఇలా అనర్హత వేటు వెయ్యమని ప్రత్యర్ధులు, ఏదైనా బలమైన కారణం ఉంటేనే కోరతారు. కాని ఇక్కడ వైసీపీ, ఎదో ప్లాన్ ప్రకారం చేస్తుంది. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కుంటుందో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read