అధికారంలో ఉన్న పార్టీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్లీన్ ఇమేజ్ తో వ్యవహరించాలి. నేను రూపాయి అవినీతి చెయ్యను, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా అంటున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మరింత జాగ్రత్తగా ఉండాలి. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ ఎంపీగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్‌ మాత్రం బ్యాంకులకు బాకీ పడుతున్నారు. దీంతో బ్యాంక్ పీవీపీ ఆస్తులు వేలానికి నోటీస్ ఇస్తుంది. పీవీపీ, ప్రముఖ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకుకు 148 కోట్ల 90 లక్షల రూపాయలకు బకాయి పడ్డారు. ఎన్ని సార్లు అడిగినా సరైన స్పందన రాకపోవటంతో, క్యానరా బ్యాంక్ ఆ డబ్బులు వసూలు చేయడానికి వేలం పాటను నిర్వహించటానికి రెడీ అవుతుంది. పొట్లూరి వరప్రసాద్ కు చెందిన కంపెనీ అయిన పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థను ఈ నెల 14వ తేదీన వేలం వెయ్యటానికి సిద్ధం అయ్యింది.

canara 03082019 2

దీనికి సంబంధించి క్యనరా బ్యాంక్ ప్రక్రియ మొత్తానికి సంభందించిన వివరాలను పత్రికా ప్రకటన ద్వరా తెలియ చేసింది. ఈ ప్రక్రియ మొదలు పెట్టక ముందే, రెండు నెలల కిందటే పీవీపీకి, కెనరా బ్యాంక్ నోటీసును జారీ చేసింది. అయినా అక్కడ నుంచి స్పందన లేదు. పీవీపీకి చెందిన పీవీపీ కేపిటల్‌ కంపెనీ 2003లో కెనరా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. అయితే ఆ లోన్ చెల్లింపు విషయంలో మాత్రం, సకాలంలో తీర్చలేకపోవటంతో, నోటీసులు ఇచ్చినా స్పందించక పోవటంతో బ్యాంక్ ఇప్పుడు వేలం ప్రక్రియ మొదలు పెట్టింది. జులై 2వ తేదీ నాటికి ఈ రుణం మొత్తం వడ్డీతో కలిపి 148,90,40,170 రూపాయలకు చేరింది. లోన్ తీసుకున్న సమయంలో పీవీపీ, ఆయన భార్య ఝాన్సీ హామీదారులుగా ఉన్నారు. పీవీపీ భార్య ఝాన్సీ ఇప్పుడు పీవీపీ గ్రూప్ కు చెందిన పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ ఛైర్మన్ గా ఉన్నారు.

canara 03082019 3

వీరికి ఎన్ని సార్లు నోటీసులను పంపించినా, స్పందించకపోవడం వల్ల పీవీపీ కంపెనీలు అయిన, పీవీపీ వెంచర్స్, క్యాపిటల్స్ లిమిటెడ్ ఆస్తులను వేలం వేయటానికి కెనరా బ్యాంకు రెడీ అయ్యింది. మరో పక్క ఈ కంపెనీల పేరుతో పీవీపీ గతంలోనే చెన్నై సమీపంలోని పెరంబూరు, పురసవాక్కంలల్లో 2, 62,160 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా వేలం వేస్తామని కెనరా బ్యాంకు తెలిపింది. దీనికి సంబంధించి జూన్ 3వ తేదీన బ్యాంక్ పత్రికల్లో ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం, 40 రోజుల తరువాత, అంటే జూలై 14వ తేదీన వేలంపాట వెయ్యనున్నారు. దీని పై ఇప్పటికే రాజకీయంగా కూడా పీవీపీ టార్గెట్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ విషయం పై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read