తెలుగు యువత అధ్యక్షుడు, గుడివాడ నుంచి తెలుగుదేశం తరుపున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్, పార్టీ మారుతున్నారు అంటూ గత మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో పని చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే చర్చలు అయిపోయాయని, దేవినేని అవినాష్ కు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు జగన్ అప్పచేప్తారని వార్తలు వచ్చాయి. దేవినేని అవినాష్ తో పాటు, కొంత మంది కార్పోరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు, కడియాల బుచ్చిబాబు కూడా జగన్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పై అవినాష్ కి కూడా మక్కువ ఉందని, తెలుగుదేశంలో ఉంటే అక్కడ గద్దె ఉండటం వల్ల, తనకు అవకాసం రాదని, అవినాష్ కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.

avinash 06082019 1

అయితే ఈ వార్తల పై అటు అవినాష్ కాని, అటు తెలుగుదేశం పార్టీ కాని, ఇటు వైసీపీ కాని అసలు స్పందించలేదు. ఈ నేపధ్యంలో అవినాష్ మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కాలేదు. మూడు రోజులు ఖండించక పోవటంతో, అవినాష్ పార్టీ మార్పు ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే నిన్న చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్ట్ కి రావటంతో, ఎప్పటిలాగే దేవినేని అవినాష్ వచ్చి, ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. దీంతో అవినాష్ పార్టీ మారాడులే అని పార్టీ కార్యకర్తలు అనుకున్నారు. అయినా అవినాష్ ఖండించలేదు కదా అనే ఆందోళన. దీంతో ఈ ప్రచారాన్ని అంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, దేవినేని అవినాష్ ఈ రోజు పార్టీ మార్పు వార్తల పై ఒక్క ముక్కలో తేల్చేసారు.

avinash 06082019 1

ఈ రోజు తన ఆఫిషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ పేజిలో, పార్టీ మార్పు వార్తల పై స్పందించారు. "నేను ఎల్లప్పుడూ తెలుగుదేశం తోనే చంద్రబాబు గారి తోనే. మీ దేవినేని అవినాష్" అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు. దీంతో పార్టీ మారతారు అంటూ చేసిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. నిజానికి దేవినేని నెహ్రు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్, అనుకున్న దాని కంటే ఎక్కువే సక్సెస్ అయ్యారని చెప్పాలి. తండ్రి మరణం తరువాత కూడా, ఎక్కడా రాజకీయంగా తప్పటడుగులు వెయ్యలేదు. చంద్రబాబు మాటకు శిరసావహిస్తూ, ఎవరూ చెయ్యని సాహసం, గుడివాడలో పోటీ చేసి, కొడాలి నానికి చుక్కలు చూపించారు. ఓడిపోయినా, ధీటుగా బదులు ఇచ్చారు. పార్టీ ఘోర ఓటమి తరువాత, నాయకులు పెద్దగా పట్టించుకోక పోతే, చిన్నవాడు అయినా సరే, టిడిపి శ్రేణుల పై జరుగుతున్న దాడులుని ముందుండి ఎదుర్కున్నారు. అంత బలంగా అవతల జగన్ ఉన్నా లెక్క చెయ్యక, దాడులు జరిగిన వారి వైపు ఉంటూ, వారికి అండగా ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇప్పుడు టిడిపికి అవసరం కూడా. అవినాష్ లాంటి వారికి, బలమైన నాయకులుగా ఎదగటానికి కూడా ఇదే మంచి అవకాసం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read