జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం విషయంలో, కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు పై, తెలుగుదేశం పార్టీ తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ పార్టీ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగిస్తుందని చంద్రబాబు అన్నారు. అలాగే ఈ నిర్ణయంతో అయినా, జమ్మూకాశ్మీర్ లో శాంతియుత వాతావరణం రావాలని, కోరుకుంటున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేసారు. "Telugu Desam Party supports the Union Govt as it seeks to repeal Article 370. I pray for the peace and prosperity of the people of J&K.". అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు "I welcome the decision of the Union Govt to scrap Article 370. I hope that the people of J&K witness peace and development."

cbn 05082019 2

ఇది ఇలా ఉంటే రాజ్యసభలో చర్చ సందర్భంగా కూడా, తెలుగుదేశం పార్టీ ఆన్ రికార్డు తన అభిప్రాయాన్ని చెప్పింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే జమ్ముకశ్మీర్‌ ప్రజలు స్వేచ్చగా, సంతోషంగా జీవించేందుకు, ఇక నుంచి అయినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ కనకమేడల అన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు ఒకే హక్కులు, సమాన హక్కులు ఉండాలనేది తమ పార్టీ విధానం అని, దీనికి మద్దతు తెలుపుతున్నాం అని అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా కాశ్మీరీ ప్రజలు అశాంతి మధ్యే ఉన్నారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో, ఇక నుంచి అయినా వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ అంశంలో కేంద్రానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందని చెప్పారు.

cbn 05082019 3

మరో పక్క, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం పై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ కూడా స్పందించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చెయ్యటం ఎంతో సంతోషించే విషయం అని అద్వానీ అన్నారు. దేశ సమగ్రతను బలోపేతం చేసే విధంగా ఈ నిర్ణయం ఉందని, ఇది ఎంతో గొప్ప ముందడుగని అద్వానీ అనంరు. ఆర్టికల్‌ 370 రద్దు అనేది బీజేపీ సిద్ధాంతాల్లో ఒకటని అద్వానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా లకు అభినందనలు తెలుపుతున్నా అని అద్వానీ అన్నారు. ఇక నుంచి అయినా జమ్ము కాశ్మీర్ లో, స్వేఛ్చ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా అని అద్వానీ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read