కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాషాయ జెండా ఎగరువేయలాని మోడీ, షా తహతహలాడుతున్నారు. ఇందుకోసం వీరు ఎంచుకున్న మార్గంలో, ఇప్పటి వరకు ఎదురు లేదనే చెప్పాలి. ఎవరిని టార్గెట్ చేసినా, వారిని నయానో, భయానో, న్యాయంగానో, అన్యాయంగానో ఓడించి పక్కన కూర్చోబెడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని చెప్పి మరీ కొట్టారు, బెంగాళ్ లో మమతకు చుక్కలు చూపించారు, తెలంగాణాలో ఎదురు లేదు అనుకున్న కేసీఆర్ ఇలాకలో, నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు, కర్ణాటకను కైవసం చేస్తుకున్నారు, రేపో మాపో మధ్యప్రదేశ్, రాజస్తాన్ ని కూడా లాగేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తరువాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణా, వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి రావటానికి చూస్తుంది.

nani 04082019 2

అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనీసం 30-40 సీట్లు గెలిచే టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ మొదలు పెట్టింది. ముందుగా చంద్రబాబుని తప్పించి, వారి పని ఈజీ అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే, చంద్రబాబుకి వేసిన స్కెచ్ లు అవసరం లేదు. రాత్రికి రాత్రి పార్టీని క్లోజ్ చెయ్యొచ్చు. కాని వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా, ప్రతి రోజు విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. 60 రోజులకే, జగన్ ప్రభుత్వం అన్నిట్లో విఫలం అయ్యింది అంటున్నారు. దీనికి తోడు, జగన్ చేసే పనులు కూడా బీజేపీకి కలిసి వస్తున్నాయి. అయితే, బీజేపీ ఎన్ని మాటలు అంటున్నా, వైసీపీ నుంచి మాత్రం అసలు రియాక్షన్ అనేది లేదు. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే.

nani 04082019 3

అయితే ఇందుకు భిన్నంగా, ఈ రోజు వైసీపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బీజేపీ పై మండి పడ్డారు. పోలవరంలో నవయుగని తప్పించటం పై, పార్లమెంట్ లో, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఈ రోజు మంత్రి పేర్నినాని మాట్లాడుతూ, కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ లో ఇలా మాట్లాడిందని, పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, బాధ్యతాయుత పదవిలో ఉంటూ, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కక్షసాధింపు ధోరణిలో ఉన్నాయని నాని ఆరోపించారు. అయితే ఏకంగా పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటననే, ఏపి మంత్రి కక్ష సాధింపు, రాజకేయం అంటున్నారు అంటే, బీజేపీతో వైసీపీకి నెమ్మదిగా గ్యాప్ పెరుగుతుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అవకాసం కోసం, వైసీపీని రెచ్చగోడుతున్న బీజేపీ, ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దీని పై సోమవారం సమీక్ష చేస్తామని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read